సుమతీ శతకం పద్యం 62(౬౨) ఆకలి యుడుగని కుడుపును వేఁకటి యగు లంజ పడుపు విడువని బ్రతుకున్ బ్రాఁకొన్న నూతి యుదకము మేకల పాడియును రోఁత మేదిని సుమతీ తా.: ఓ మంచి తెలివి గల బుద్ధిమంతుడవైన, సుమతీ... ఎంత తిన్నా ఆకలి తీర్చని తిండి, గర్భము వచ్చిన తరువాత కూడా పడుపు వృత్తి మానని వేశ్య, పాచి పట్టిన బావి లోని నీరు, మేకల పాలతో తయారైన పదార్ధములు రోత/ఏవగింపు/అసహ్యాన్ని కలిగిస్తాయి .... ...అని సుమతీ శతక కారుని వాక్కు. .....ఓం నమో వేంకటేశాయ Nagarajakumar.mvss


కామెంట్‌లు