సుమతీ శతకం పద్యం 64(౬౪) ఉపమింప మొదలు తియ్యన కపటం బెడ నెడను జెరకు కై వడినే పో నెపములు వెదకును గడపటఁ గపటపు దుర్జాతి పొందు గదరా సుమతీ తా.: ఓ మంచి తెలివి గల బుద్ధిమంతుడవైన, సుమతీ... చెరకు గడ తినటం మొదలు పెట్టినపుడు రుచిగా, తియ్యగా వుంటుంది. కొంత సమయము నమిలిన తరువాత పిప్పి వస్తుంది. మొదట వున్న రుచి వుండదు. అలాగే దుష్టులతో, దుర్మార్గలతో, చెడు లక్షణములు కలవారితో స్నేహం కూడా. మొదలు పెట్టినప్పుడు చాలా సంతోషంగా, ఆనందకరంగా అని పిస్తుంది. కానీ, కాలం గడుస్తున్న కొద్దీ ఈ సాంగత్యం లోని చెడు ప్రభావం తెలుస్తుంది. .... ...అని సుమతీ శతక కారుని వాక్కు. *మన కళ్ళు, నాలిక, ముక్కు తెలిపే విషయాలతో కాక, మనసు చెప్పిన మాటలు విని చేసే స్నేహం నాలుగు కాలాల పాటు నిలకడగా వుండి, స్నేహం చేసే ఇరువురికి ఉపయోగ పడేదిగా వుంటుంది.* *కర్ణ, దుర్యోధనుల స్నేహం ౧౭(18) అక్షౌహిణుల సైన్యాన్ని చంపింది* *రామ, సుగ్రీవుల స్నేహం ఇరువురికి పరస్పర సహాకారి అయ్యింది.* *కృష్ణార్జునుల స్నేహం లోకానికి ఉపయోగించే గీతను ఇచ్చింది.* *మొదటిది అధమం, రెండవది సామాన్యం, మూడవది అత్యుత్తమ స్నేహం. మనమందరం మూడవ రకమైన స్నేహం కోరుకోవాలి* అని భావం......ఓం నమో వేంకటేశాయ Nagarajakumar.mvss


కామెంట్‌లు