సుమతీ శతకం పద్యం 65(౬౫) ఎప్పటి కెయ్యది ప్రస్తుత మప్పటి కా మాటలాడి యన్యుల మనముల్ నొప్పింపక, తానొవ్వక, తప్పించుక తిరుగువాఁడు ధన్యుఁడు సుమతీ! తా.: ఓ మంచి తెలివి గల బుద్ధిమంతుడవైన, సుమతీ... సందర్భానికి, ఆ సమయానికి తగినట్లుగా మాట్లాడుతూ, ఎవ్వరినీ బాధ పెట్టకుండా, తాను బాధ పడకుండా పనులు చక్క పెట్టే వారు మిక్కిలి ధన్యులు .... ...అని సుమతీ శతక కారుని వాక్కు. *ఎంతటి తెలివి గలవాడైనా, నలుగురిని నొప్పించకుండా, తాను చెప్ప దలచుకున్నది చెప్పి పని పూర్తి చేయగలగాలి. అప్పుడే వారి తెలివి తేటలకు సార్ధకత అని భావం.* *ఇది నిజంగా కత్తి మీద సామే.* *అందుకే త్యాగరాజ స్వామి చెప్పారు కదా - సమాయానికి తగూ మాటలాడి....* .....ఓం నమో వేంకటేశాయ Nagarajakumar.mvss


కామెంట్‌లు