శరీరానికి దెబ్బ తగలడం , బెణుకులకు చిట్కా :- అనుకోకుండా మనం ఏదో పని చేస్తున్నప్పుడు శరీరానికి దెబ్బ తగలడం సహజం. అలాగే సడెన్ గా వంగుతున్నపుడు , లేస్తున్నపుడు శరీరం లో బెణుకులు సంభవిస్తాయి. ఇబ్బంది పెడతాయి. కొన్ని ఆవాలను నీటిలో వేసి నాననిచ్చి ముద్దగా నూరి దెబ్బలు , వాపులు వున్న చోట లేపనంగా పూయాలి. వాపులు తగ్గుతాయి. నొప్పి కూడా తగ్గుతుంది. కొన్ని వెల్లుల్లి పాయలను చితగ్గొట్టి అందులో ఉప్పు కలిపి బెణుకులపై పూతగా పూయడం వలన బెణుకులు, నొప్పి తగ్గిపోతుంది. పై రెండు సమస్యలు ఎక్కువగా వున్నప్పుడు కాస్త దొడ్డు ఉప్పును వేయించి కాపడం కూడా చేస్తే త్వరగా నొప్పులు, వాపులు తగ్గుతాయి. -పి . కమలాకర్ రావు


కామెంట్‌లు