రాజ్య రక్షణ. డా.బెల్లంకొండనాగేశ్వరరావు.చెన్నయ్.: --అమరావతి రాజ్యాన్ని చంద్రసేనుడు అనే అనే రాజు పరిపాలిస్తుండేవాడు. వయోభారంచే తన రాజ్యాన్ని రెండు భాగాలు చేసి తన కుమారులైన జయ విజయులకు పట్టాభిషేకం చేయదలచి తన కుమారులను చేరపిలిచి 'నాయనలారా! ధర్మం నాలుగు పాదాలు అంటే,మెదటి పాదం సత్యం, రెండోపాదం శుచి శుభృతలు,మూడోపాదం దయా,నాలుగోపాదం దానమని పెద్దలు చెప్పారు.ప్రయత్నం,చురుకుదనం,ఇంద్రియ నిగ్రహం,పరాక్రమం,ఎట్టి పరిస్ధితులలోనూ భయపడకుండా ఉండటం,కోపాన్ని, కోరికలను, అసూయ దరిచేరనివ్వకండి.నిస్పాక్షికత,క్షమ,దయగుణం,కలిగి ఉండి. దుష్టులు,చోరులు,శత్రువులు పట్ల ఖటినంగా ఉండాలి. భోగాలకు, జూదానికి, మధ్యానికి,యుథ్థానికి బానిసలు కాకూడదు.ముఖ్యంగా గతంలో ఉమ్మడిగా ఎంతో బలంగా ఉన్న మన రాజ్యం ఇప్పుడు రెండు భాగాలుగా బలహీనం అవుతుంది. మనపై గతంలో ఇరుగు పొరుగు రాజులు దండెత్తి రావడానికి సంకోచించేవారు.ఇప్పుడు అదను చూసి మీపై దాడి చేయడానికి సిధ్ధపడతాయి.మీరు అన్ని రంగాలలో సమతలంగా అభివృధి సాధించండి.ప్రజలకు కష్టం కలిగేలా పన్నులు విధించకండి'అని హితభోధ చేసి,ఇరువురు కుమారులకు రాజ్యాన్ని రెండు భాగాలుగా విభజించి, పట్టాభిషేకంచేసి,తీర్ధయాత్రలకు సతీ సమేతంగా వెళ్ళి పోయాడు చంద్రసేన మహారాజు.జయుడు తనవంతుగా వచ్చిన రాజ్యంలో అన్ని విద్యా,వ్యవసాయం, వైద్యం,రక్షణ వంటి పలు రంగాలలో దృష్టిపెట్టి నిరంతర కృషితో అభివృధ్ధి సాధించింధించాడు.విజయుడునేను ఒకరిపై యుధ్ధానికి వెళ్ళనప్పుడు మరోకరు నాపై యుధ్ధానికి ఎందుకువస్తారు అనుకుని, తన వంతుగా వచ్చిన రాజ్యంలో వ్యవసాయంపై దృష్టి నిలిపి బంజరు భూములు సైతం పదును చేసి, ప్రజలందరిని ప్రోత్సహిస్తూ,తన సైన్యం కత్తులను కొడవళ్ళుగా మార్చి విరివిగా ధాన్యం పండించాడు.రాజ్యం అంతటా ఎక్కడ చూసినా పలురకాల ధాన్యరాసులతో,సంతోషంగా ఉన్నారు.ఇదంతా విజయుని రాజ్యానికి సరిహద్దు రాజ్య మైన'చంపావతి'రాజు విక్రమసేనుడు ఒకరోజు తన సైనిక బలంతో విజయునిపై యుధ్ధానికి బయలుదేరాడు.వేగులద్వారా విషయం తెలుసుకున్న జయుడు తన సోదరుడైన విజయునికి సహాయంగా సర్వ సైన్యంతో తరలివచ్చి విక్రమసేనుడిని ఓడించి పారద్రోలాడు.అనంతరం తనసోదరుడు విజయుని తో 'సోదరా రాజ్యం వీరభోజ్యం' బలవంతుడే రాజ్యం.నువ్వు రక్షణ రంగంలో బలహీనుడిగా ఉన్నందున ఈదాడి జరిగింది. దేశం అభివృధ్ధి సాధించడం అంటే అన్ని రంగాలలో సమతుల్యత పాటించాలి.నువ్వు రక్షణ రంగం గురించి ఆలో చించక పోవడంవలన ఈ ఆపద సంభవించింది భవిష్యత్తులో రక్షణ రంగాన్ని కూడా బలంగా ఉండేలా చూసుకో,వ్యవసాయంతోపాటు రాజ్యరక్షణ సమతుల్యత పాటించు. అప్పుడే మనం రాజ్యరక్షణ చేయగలం'అన్నాడు.సోదరుని సలహాతో గొప్ప సైనిక శక్తిని రూపొందించుకున్న విజయుడు సుఖంగా రాజ్యపాలన చేసాడు.


కామెంట్‌లు