పింకీ చాల మంచి బాలిక.. అందంగా ఉంటుంది. కానీ గత కొద్దీ నెలలుగా బాగుండటం లేదు. దీంతో అమ్మ, నాన్న, ఉపాధ్యాయులు, స్నేహితులు బాధ పడుతున్నారు. ఒక వారం రోజుల తరువాత పింకీ వాళ్ళ అమ్మ నాన్నలతో పిల్లల డాక్టర్ వద్దకు వెళ్లారు.. పింకీ కొంత అనారోగ్యం తో ఇబ్బంది పడుతుందని డాక్టర్ చెప్పారు. భయ పడవలసిన అవసరం లేదు, నేను మందులు ఇస్తాను.. అని రాసిచ్చారు. ఆ మందు ఒక సారి వాడగానే.. పింకీ హుషారుగా తయారైంది. రోజు స్కూల్ కు వెళ్లడం ప్రారంభించింది. పింకీ ప్రవర్తనలో కూడా మార్పు వచ్చింది. వారంతా డాక్టర్ కు ధన్యవాదాలు తెలిపారు. ఇది ఒక పింకీ కథ. - డాక్టర్ కందేపి రాణి ప్రసాద్


కామెంట్‌లు