శ్రీరాముని దయచేతను నారూఢిగ సకల జనుల నౌరా యనగా ధారాళమైన నీతులు నోరారఁగ జవులు పుట్ట నుడివెద సుమతీ తా.: ఓ మంచి తెలివి గల బుద్ధిమంతుడవైన, సుమతీ... సకల గుణాభిరాముడు శ్రీరాముడు, తాను ఆచరించి లోకానికి పరిచయం చేసిన నీతి మార్గమును, శ్రీరాముని అనుగ్రహం తో లోకంలో జనులందరూ మెచ్చుకునే విధంగా, మళ్ళీ మళ్ళీ చదవాలి, వినాలి అనిపించే విధంగా మీకు చెపుతున్నాను.... ...అని సుమతీ శతకకారుని వాక్కు. ఏ యుగంలో అయినా, ఏ మనిషికి ఐనా లోక వంద్యడు, సకల సద్గుణ సంపన్నుడు, అయిన శ్రీరామచంద్ర మూర్తి చూపిన దారి అనుసరణీయం. ఈ మనుష్య లోకంలో ఒకరితో ఒకరు ఎలా మాట్లాడాలి, ఏవిధంగా ప్రవర్తించాలి అనే విషయాన్ని తాను కొడుకుగా, అన్నగా, భర్తగా ఆచరించి మనకు చూపాడు. ఆ నీతులను మన బుద్ధికి హత్తుకునే విధంగా సుమతీ శతకకారుడు మనకి చెప్తున్నారు. .....ఓం నమో వేంకటేశాయ Nagarajakumar.mvss


కామెంట్‌లు