కవితా శీర్షిక:-చెట్టు తల్లి కవితా రచన:- లిఖిత్ కుమార్ గోదా తల చుట్టూ పూలు పెట్టుకొని, తన చేతులైన కొమ్ములతో, తన ఒత్తయిన జుట్టుని పట్టుకుంటూ, తన కాళ్ళను భూమిలోకి దింపి, రాత్రి పగలు నిలబడుతూ, చలి వణికిస్తున్నా, ఎండ భగ్గు చేస్తున్నా, వానకు తడుస్తున్నా, సుస్థిరంగా నిలబడుతూ తనకోసం ఆకస్మాత్తుగా వచ్చిన వాయు మిత్రుడు తగిలి తన పూలను పుడమితల్లికి సమర్పిస్తూ తన సంతానమైన పండ్లను మానవులకు, జంతువులకు ఈ సమస్త జీవకోటికి అందిస్తున్న చెట్టు తల్లికి వందనాలు


కామెంట్‌లు