పిల్లలం పిల్లలం మేం పిడుగులం ఆడిపాడే బుడుగులం ౹౹పిల్లలం౹౹ నింగి నేలకు నిచ్చనలేసి పైకి, క్రిందికి ఊయ్యాలూగుతం పరుగుల వరదై ఎక్కి దిగుతూ జారుడు బండపై పల్టీ కొడుతం ౹౹పిల్లలం౹౹ ఊరు వాడ చెక్కెర్లేసి సయ్యాటల దాగుతూ వుంటాం అడవి జంతువులతో పాటలు పాడి పండ్లు,ఫలాలతో కడుపు నింపుతాం ౹౹పిల్లలం౹౹ క్రమశిక్షణతో బడికి వెళ్ళి గురువుల చెంతన విద్య నేర్చుతాం విజయాలెన్నో పొందుతూ సాగి నవ భారతావనికి వారసులౌతాం ౹౹పిల్లలం౹౹ ఉండ్రాళ్ళ రాజేశం
Publisher Information
Contact
molakanews@gmail.com
9848992841
H.NO. 1-9-319/1/1/G2, VIJAYADURGA RESIDENCY VIDYANAGAR,DIST-HYDERABAD-44
About
This is the children's page
Share this page
Email
Message
Facebook
Whatsapp
Twitter
LinkedIn
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి