*ఫాదర్స్ డే సందర్భంగా* చదరని సంతకం నాన్న ..... లేలేత పాదాలకు మట్టి అంటకుండా భుజాలపై ఎక్కించుకుని మోసి, ఆడించి బుడిబుడి అడుగులు నేర్పి గుండె నిండా భారం మోస్తూ, కంట తడి రాకుండా పైకి చిరు నగవులతో బిడ్డల భవిష్యత్తుకు వరుస బాటలు నాన్న కష్టకాలంలో తాను అర్థాంతరంగా లక్ష్యాలనొదిలి కుటుంబాన్ని తలపై నిలిపి, బతుకు జట్కాబండితో బిడ్డలను విజయంవైపు మళ్ళిస్తూ, వెన్నంటి నిలిచేది నాన్న మంచి చెడులను ఆలి, బిడ్డలతో చర్చించి కఠిన నిర్ణయాలతో మనసులు గాయం చేసినా వారి ఎదుగుదలలో యించుక నిర్లక్ష్యం చేయక నిత్య కృషీవలుడై మార్గం సుగమం చేసి బిడ్డలను కనురెప్పలలో దాచుకునే ఘనుడు నాన్న శక్తికి మించి సాధన జేస్తూ నిశబ్థ మౌనిలా కదలాడుతూ తెరిచిన పుస్తకం నాన్న అడ్డు నిలువుల ఆటుపోట్ల అతుకుల సాందిరైన జీవితాన త్యాగధనుడైన నాన్న ఎక్కడున్న మనసంతా గోదారి పరుగులే అదే నాన్న జీవిత అంతరంగ మేథో మధనం బిడ్డల ఎదుగుదలలో చదరని సంతకం నాన్న ఉండ్రాళ్ళ రాజేశం


కామెంట్‌లు