బంధుప్రీతి బాలల కథా సంపుటి ఆవిష్కరించిన మంత్రి హరీష్ రావు రాష్ట్ర ఆర్ధిక శాఖా మంత్రివర్యులు హరీష్ రావు చేతుల మీదుగా బాల సాహితీవేత్త ఉండ్రాళ్ళ రాజేశం రచించిన బంధుప్రీతి బాలల కథా సంపుటి ఆవిష్కరణ జరిగింది. బాలల వికాసానికి బంథుప్రీతి కథా సంపుటి ఎంతగానో తోడ్పడుతుందని, బాల సాహిత్య రచనలు మరింతగా అవసరమని నేటి బాలలే రేపటి పౌరులని మంత్రి హరీష్ రావు అన్నారు. ఆవిష్కరణ కార్యక్రమంలో మీడియా అకాడమీ సభ్యులు కొమురవెళ్ళి అంజయ్య, పుస్తక రచయిత ఉండ్రాళ్ళ రాజేశం, తోట అశోక్, బస్వ రాజ్ కుమార్, సతీష్, యు.తిరుపతి తదితరులు పాల్గొన్నారు.


కామెంట్‌లు