తెలుగు సాహిత్యంలో ప్రసిద్ధి చెందిన కవి పాల్కురికి సోమనాథుడు. ఈయన శైవమతావలంబికుడు. ఈయన రాసిన గ్రంథములను తర్వాత కాలంలో అనేక మంది కవులు పద్య రూపంలో రాశారు. సోమనాథ కవి తను భ్రృంగిరిట గోత్రజుడనని చెప్పుకున్నాడు. గురులింగ పుత్రుడి నని అనుభవ సారములో ఈ క్రింది పద్యములో చెప్పుకున్నాడు. క: బృంగిరిట గోత్రుడను గురు/ లింగ తనూజుండ ఉ శివ కులీనుడ దుర్వ్యా/సంగవివర్జిత చరితుడ/ జంగమ లింగ ప్రసాదసత్రాణుండన్// ఈ కవి తండ్రి విష్ణు రామ దేవుడు తల్లి శ్రియా దేవి, ఈ విషయము బసవ పురాణాన్ని బట్టి తెలియుచున్నది.గురు లింగార్యుడు ఈయన దీక్షాగురువు, తండ్రి కాడు. ఈయన "సముదంచద్వరషభస్తనరమహీజారామనం సోమనాథం" అని పాల్కురికి సోమనాథుని పూర్వ కవిగా స్తుతిన్చుటచేతను1168వ సంవత్సరమునందు మ్రృతినొందిన బసవన్నకు సోమన శిష్యపుత్రుడగుట చేతను,ఈ నడిమి కాలమందుండిన పాల్కురికి సోమనాథుడు బసవనకు తరువాత ముప్ఫదేండ్లు అనగా 1195వ సం.ప్రాంతమునందుండినట్లు చెప్ప వచ్చునని కర్ణాటక చరిత్రములు చెప్పుచున్నవి.1196వ సం.వరకు పరిపాలించి పరమ పదించిన ప్రతాపరుద్రుని కాలములో నుండి, ఆతనిచే అగ్రహారములు కానుకగా పొందాడు. గనుక ఈ కాలంలోనే ఉండ వచ్చును. మరి కొందరు సోమనాథుడు మరికొంత కాలం వెనుకకు జరిపి 1180వ సం.వాడని చెప్పుదురు. శ్లో: గురులింగారస్య ద్యాస స్తగర్భవః/బసవేస్ర తనయాం బసవేశ్వర గోత్రకః/బసవేశభుజిష్యాత్మభవో బసవకింకరః/ శ్రీమత్ పాల్కురికి సోమేశనామమాహం సర్వవిత్తమః// పండితారాధ్య చరితాలంకృతాం క్రుషి మారభే/ తతశ్శృణు నతామాత్య శేఖర// అని పండితారాధ్య చరిత్రమందు సోమనాథుడు తన్ను గూర్చి చెప్పుకొని యున్నాడు.దీనిని బట్టి తాను లింగార్యుని శిష్యుడనియు, బసవేశ్వరుని పుత్రుడనియు కనబడుచున్నది. ఇతడు వీరశైవుడు. శైవమత గ్రంథములు అనేకంవ్రాసాడు. ఈ సోమనాథకవి రచించిన తెలుగు గ్రంథాలలో ద్విపద రూపంలో నున్న పండితారాధ్యచరిత్రం, బసవపురాణం ముఖ్యమైనవి.ఈయనపండితారాధ్య చరిత్రమును శ్రీనాథుడు మరియు బసవ పురాణమును పిడపర్తి సోమనాథుడు పద్య కావ్యములుగా వ్రాసారు.ఒకసారి ఓరుగల్లు పురమున గల శివాలయానికి ప్రతాపరుద్ర చక్రవర్తి వెళ్లడం జరిగింది. శైవులు మండపము మీద కూర్చుని పాల్కురికి సోమనాథుడు రచించిన బసవ పురాణం విను చుండిరి. అది చూసి రాజు ఏమిటది అని అడుగుగా, అప్పుడు ఒక పండితుడు "మొన్న మీ నడుమన పాల్కురికి సోముడు, అల్లిన అప్రమాణ బసవ పురాణము" అని చెప్పాడు. అందుకు బాధపడిన ఆ శివ భక్తులు పొరుగూరునున్న సోమనాథునికీ వృత్తాంతము తెలిపారు .ఆయన తన శిష్యులతో బయలుదేరి ఆ దూర్త పండితుని మరియు అతని శిష్యులతో వాదోపవాదములు చేసి జయించాడు.అంతే కాదు ప్రతాపరుద్రుని మెప్పు పొందాడు. సోమనాధుని మహిమ వల్ల ఆ దూర్త పండితులు కూడా శివ భక్తులు అయ్యారని ప్రతీతి. ( ఇంకా ఉంది ) - 45వ భాగం - బెహరా ఉమామహేశ్వరరావుసెల్ నెంబర్:9290061336


కామెంట్‌లు