తెలుగు సాహిత్యంలో చెప్పుకోదగిన కవుల్లో వినుకొండ వల్లభరాయుడు ఒకరు. ఇతడు క్రీడాభిరామము అను పేర దశ రూపములలో ఒకటి అయిన వీధి నాటకం రచించాడు. తెలుగులో లో ఈయన రాసినదే నాటకంగా చెప్పుకుంటారు ఈ క్రీడాభిరామం రావిపాటి తిప్పన్నకవి సంస్కృతమున రచించిన "ప్రేమాభిరామం" అను గ్రంథానికి అనుసరణమని చెప్పుకుంటారు.ఈ ఈ గ్రంథములో అల్లికలు వర్ణములు అనేకం ఉన్నాయి. పీఠికను చదివిన తెలియ గలదు. కానీ మూల గ్రంథాన్ని ఎంతవరకు అనుసరించాడా! లేదా స్వేచ్ఛగా రాశాడా! అనే వివరాలు పూర్తిగా తెలియ రావడం లేదు. ఈ నాటకం యొక్క ప్రధాన రంగం కాకతీయుల రాజధాని ఓరుగల్లు నుండి ఆరంభమవుతుంది. ఈ రాజ్యాన్ని పరిపాలించిన కడపటి కాకతీయ చక్రవర్తికాలం క్రీ.శ.1296మొదలు 1323 వరకు పాలించిన చక్రవర్తి ద్వితీయ ప్రతాపరుద్ర చక్రవర్తి. కాని ఈ నాటకం క్రీ.శ.1420లో రచింప బడింది.ఈ కాలంలోనే శ్రీనాథుడు కర్ణాటక దేశమునకు పోయి "వల్లభాభ్యుదయం" వ్రాసేడని అంటారు. క్రీడాభిరామంలోని"కందుక కేళీ సల్పెడు ప్రకారమున్ " అను పద్యం ఒకటి మరియు "కుసుమం బుద్దిని చీర కొంగు నొలయన్" అను పద్యం మరో పద్యం శ్రీనాథుని వీథి నాటకము లోని దని తెలుస్తుంది. కాని పండిత విమర్శకులు దీని గురించి తర్భన భర్జనలు చేసినప్పటికిని ఎవరిదనే నిశ్చయానికి రాలేక పోయారు. ఈ క్రీడాభిరామంఅను వీథి నాటకం నగరం పొలి మేరలలో గల ప్రదేశాలో ఓరుగంటి వాసులైన గోవింద మంచిన శర్మ,ఆతని చెలికాడైన టిట్టిభశెట్టి అనే వ్యాపారి సంభాషణలుఉన్నాయి.ఈ సంభాషణలు కవి యొక్క తాతగారైనచంద్రం మాత్యుడు బుక్కరాయలు మంత్రితో ఈ పద్యం చెప్పాడు. శా‌.కర్ణాటక్షితినాథుడైన పెదబుక్క క్ష్మాపదేవేంద్రున/ భ్యర్ణామాత్యుని దానఖేచరుని జంద్రాధీశు బంధు ప్రియున్/వర్ణించు గవికోటి శంకరజటా వాటీ తటాంతర్నదీ/స్వర్ణద్యంబుతరంగిరింఖణలసత్సా హిత్యసౌహిత్య యై// ఈ ప్రస్తావనలోనే వల్లభనేని తాత అయిన లింగ మంత్రి 1377 వ సంవత్సరము మొదలుకొని రాజ్య పాలన చేసిన హరిహర రాయల కొలువులో ఉండి నట్లు తెలుస్తుంది. కవి తండ్రి అయిన తిప్పన్న అనే త్రిపురాంతకుడు కూడా ఉండేవాడు. అతడు వీరి కొలువులో భాండాగార అధికారిగా పనిచేశాడు. ఈ తిప్పన్న కుమారుడే వల్లభరాయుడు అగుట చేతను క్రీడాభిరామమును 1410లో రచించించెననుటకు ఆస్కారం కలదు. ఈ కవియే తను రాసిన ఒక పద్యంలో ప్రస్తావిస్తూ తన తమ్ములను వర్ణించుచు "వార వధూజ పుష్ప భల్లు"లని వారికి ప్రతిష్ట తో కూడిన విశేషణాలతో ఈ క్రింది పద్యాన్ని చెప్పాడు.ఈ పద్యం ద్వారా వల్లభరాయుడు తన కుటుంబ ప్రసక్తిని వివరించాడు. ఉ. మల్లస్న మంత్రికిం ద్రిపురమాతరళాళాక్షికి గాంతి రోహిణీ/వల్లభు లాత్మ సంభవులు వల్లభలింగ నతిప్పనక్షమా/వల్లభ మంత్రి శేఖరులు వార వధూజన పుష్ప బిల్లు లు/త్ఫుల్లయశోవిభా‌సితులు పుణ్యులు సింగనభైరవేంద్రులున్// ఇవిగాక క్రీడాభిరామములో చెవులకు ఇంపైన పద్యములు ఉదాహరణగా...ద్రుత తాళంబున వీర గుంభిత కధుంధుంకిటాత్కా రసం/గతి వాయింపుచు నాంతరాళికయతి గ్రామాభిరామంబుగా/యతిగూడం ద్విపద ప్రభంధమున వీరా నీకముం బాడె నొ/క్కత ప్రత్యేకముగా గుమా రకులు ఫీట్కారంబునం దూలగన్// మ. ఉడువీధీన్ శిఖరావలంబియగు నాంధ్రోర్వీశు మోసాలపై/గడియారం బుధ మ్రోసె రెండెనిమిదుల్ ఘంటాఘణత్కారముల్ /సడలెన్ భానుడు పశ్చిమంబునకు వైశ్యా పూటకూటింటికిన్/ గుడువం బోదమే లెక్క యిచ్చి కడు నాంకొన్నార మిప్పపట్టునన్//ఈ వినుకొండ వల్లభరాయకవి కాకతీయుల కాలం నాటి తెలుగు ఆచార వ్యవహారాలను, సాంప్రదాయాలను, ఉత్సవాలను తన కవిత్వంతో ప్రధమ నాటకకర్తగా నిలచి సాహితీ చరిత్రలో ప్రసిద్దికెక్కాడు. (51 వ భాగము)బెహరా ఉమామహేశ్వరరావు సెల్ నెంబర్: 9290061336*


కామెంట్‌లు