పిల్లలూ ఈరోజు మూత్ర కోశ వ్యాధుల గురించి తెలుసుకుందాం.కిడ్నీలు శరీరంలోని వ్యర్థ పదార్థాలను తొలగించడమే కాకుండా శరీరంలోని నీటి సమతుల్యాన్నికాపాడుతుంది.కిడ్నీలు దెబ్బతినడాని ఎన్నో కారణాలు ఉన్నాయి.దంతాలలోను,టాన్సళ్ళలోను క్రిమి దోషాలు ఏర్పడి కిడ్నీలను ఇన్ ఫ్లేమ్ చేస్తాయి.మూత్ర ప్రవాహానికి ఆటంకం,రక్తం నాళాలలో జీర్ణ ప్రక్రియలు కూడా కిడ్నీలను హాని కలిగిస్తాయి.కిడ్నీల్లో ఏర్పడే తీవ్ర క్రిమి దోషాలను ఎక్యూట్ నెఫ్రైటిస్ అంటారు.ఇది చిన్న పిల్లల్లోనూ, పెద్దవాళ్ళల్లోనూ ఏర్పడుతుంది.ఈ సమస్యతో మూత్రం పొగరంగుతో కూడిన ఎరుపురంగులో వస్తూ క్రమంగా తగ్గుతుంది. ముఖం ఉబ్బుతుంది.సకాలంలో చికిత్స జరగకపోతే వళ్ళంతా వాపు వస్తుంది.గుండె సంబంధసమస్యలతో మరణించే అవకాశం ఉంది.ముఖం ఉబ్బి, మూత్రం ఎర్రగా వస్తున్నప్పుడు వెంటనే డాక్టర్ ని సంప్రదించాలి.ఈ అనారోగ్యం లో మూత్రాంగాలకు తీవ్రమైన హాని జరిగి అవి సరిగ్గా పనిచేయవు.రోగికి ఆకలి తగ్గి పోతుంది.అలసట ఎక్కువ అవుతుంది.రక్తం విషపూరితమవుతుంది.దీనిని క్రానిక్ నెఫ్రైటిస్ అంటారు.-- ప్రమోద్ ఆవంచ


కామెంట్‌లు