సుమతీ శతకం పద్యం 69(౬౯) తల పొడుగు ధనముఁ బోసిన వెలయాలికి నిజము లేదు వివరింపఁగాఁ దల తడవి బాసఁ జేసిన వెలయాలిని నమ్మరాదు వినురా సుమతీ! తా.: ఓ మంచి తెలివి గల బుద్ధిమంతుడవైన, సుమతీ..... చపలచిత్తముతో వుండే వెలయాలికి, ఆమె వద్దకు వచ్చే విటుడు, ఆమె ఎత్తు ధనం ఇచ్చి ఇప్పటి నుండి సుఖంగా జీవించమని చెప్పినా, వేరొక విటుడు రాగానే కచ్చితంగా అటువైపు వెళుతుంది. అలా కాక, లేదు లేదు నేను ఇంకమీదట ఎవరినీ జూడను అని ప్రమాణం చేసినా కూడా నమ్మకూడదు ..... ...అని సుమతీ శతక కారుని వాక్కు. *వరద, పరిస్థితుల ప్రభావంలో కొట్టుకుని పోయే మనస్తత్వం వున్న వ్యక్తి ఎన్ని ప్రమాణాలు చేసినా, వారిని నమ్మరాదు అని భావం.* .....ఓం నమో వేంకటేశాయ Nagarajakumar.mvss


కామెంట్‌లు