సుమతీ శతకం పద్యం 70(౭౦) నీరే ప్రాణాధారము; నోరే రసభరితమైన నుడువుల కెల్లన్ నారియె నరులకు రత్నము; చీరయె శృంగార మండ్రు సిద్ధము సుమతీ! తా.: ఓ మంచి తెలివి గల బుద్ధిమంతుడవైన, సుమతీ..... ఈ భూ ప్రపంచంలో, నీరు ప్రాణికోటి ప్రాణాలని నిలిపుతోంది. మంచి మాటలు చెవులకు ఇంపుగా పలుకడానికే నోరు ఇచ్చాడు మనకు పరామాత్మడు. కులస్త్రీలు, పురుషునికి రత్నము కంటే ఎక్కువ. స్త్రీల సింగారంలో చీరే ప్రధాన శృంగార వస్తువు.... ......అని సుమతీ శతకకారుని వాక్కు. .....ఓం నమో వేంకటేశాయ Nagarajakumar.mvss


కామెంట్‌లు