మంచబ్బాయ్ (బాలల కథ) -రచనః కన్నెగంటి అనసూయ.--సోడారం అనీ ఊల్లోను..సోంబాబు, రాంబాబని ఇద్దరు జతకత్తులున్నారు. ఆ ఇద్దరూను ఒకే బల్లో సదుంకునీవోరు. ఆ ఇద్దర్లోనూను..సోంబాబేవో ఉన్నోల్లబ్బాయి. రాంబాబేవో లేనోల్లబ్బాయి.అయితేనీ ఈ ఉంటం, లేపోతం అనీవి ఆల్లిద్దరికీ తెలవ్వు. అంతుకే ఇద్దరూను మాంచి జతగా ఉండీవోల్లు. కల్సి తిరిగీవోల్లు. కల్సి ఆడుకునీవోల్లు. అంతెంతుకు ..ఒకర్నిడిసి ఒకల్లు ఉండీవోల్లుగాదు. ఒకల్లేవన్నా తెత్తే రెండోవాల్లకి పెట్టీవోరు. అలాగ ఎక్కడికెల్నాను కలిసెల్లి కలిసొత్తా ఉండీవోల్లు. ఒకనాడు సోంబాబుకి ఆల్లన్నయ్య పట్నం నుంచొత్తా వత్తా..ఒక సేతికి ఎట్టుకునే గడియారం కొనుక్కొచ్చేడు. సోంబాబు ఆల్లన్నయ్యకి రకరకాల గడియారాలంటే సేనా ఇది. ఎప్పుడూ ఎయ్యో గడియారాలు కొంటానే ఉంటాడు. అలాగే తమ్ముడి కోసవని కొత్తది కనిపిత్తే బాగుందలాగని కొనుక్కొచ్చేడు. దాన్ని సూసి తెగ మురిసిపోయేడు సోంబాబు. మర్నాడు దాన్ని సేతికి ఎట్టుకుని బల్లోకి ఎల్లేడు. రాంబాబు దాన్ని సూసి సేలా బాగుందని సెప్పేడు. ఆ గడియారాన్ని తీసి ఓసారి రాంబాబు సేతికెట్టేడు సోంబాబు ఎలాగుంటాదో సూద్దారని. “ సేలా బాగుంది కదా !” అన్నాడు రాంబాబు దాన్ని తిరిగి సోంబాబుకి ఇచ్చేత్తా. సోంబాబుకి అది ఇన్నాకా ఎంతుకో మనసులోను తెగ బాధేసేసింది. ఇంటికి రాగానే కొత్త గడియారాన్ని సేతి నించి తీసేసేడు. కానీ కొత్తది కదా. మల్లీ సేతికెట్టుకోబుద్దయ్యింది. పెట్టేస్కున్నాడు. రాంబాబు కూడా తన్లాగానే రోజూ సేతికి గడియారం ఎట్టుకోవాలంటే ఏం సెయ్యాలి అని ఆలోసిచ్చేడు. ఒక ఆలోసన వచ్చింది. దాంతో.. ఆ మర్నాడు బల్లోకి ఎల్తా ఎల్తా..వాల్లన్నయ్య గడియారాల్లోంచి ఒకదాన్ని తీస్కెల్లి రాంబాబుకిచ్చేడు. “ య్యెక్కడిదిది ?” అనడిగేడు రాంబాబు దానికేసి ఎగాదిగా సూత్తాను. “ మాయన్నయ్య దగ్గిర సేలా ఉన్నాయ్ ఇలాటియ్యి. అందులో ఒకటి తెచ్చేన్నీకోసం “ అన్నాడు సోంబాబు. “ వద్దు ..మా నాన్తిడతాడు..” అన్నాడు రాంబాబు. “ తిట్టల్లే. సేతికెట్టుకో..” అన్నాడు సోంబాబు. “మియ్యన్నయ్యకి తెలిత్తే నిన్ను కొడతాడేమో..” అన్నాడు రాంబాబు భయం భయంగా.. “ మాయన్నయ్యకి..ఇలాటియ్యి బోల్డున్నాయ్. ఒక్కట్నీకిత్తే ఏమయిపోదు. ఎట్టుకో..అయినా మాయన్నయ్యకి తెల్నే తెల్దు” అని నవ్వాడు సోంబాబు. అయినా ఎంతుకో భయంగా ఉంది రాంబాబుకి సోంబాబుని ఆల్లన్నయ్య ఎక్కడ కొట్టేత్తాడోనని. ఇంటికెల్లి ఆ గడియారాన్ని ఆల్ల నాన్నకి సూపిచ్చి జరిగింది జర్గినట్టు సెప్పేసేడు రాంబాబు. ఆల్ల నాన్న తిన్నగా దాన్ని తీస్కెల్లి సోంబాబు ఆల్ల నాన్నకిచ్చేసి అంతా సెప్పేసేడు. అప్పుడు సోంబాబు ఆల్లన్నయ్య కూడా అక్కడే ఉన్నాడు. అలా సెప్పేతలికి సోంబాబు ఆల్ల నాన్నకి సోంబాబు మీద కోపం వచ్చింది. తర్వాత ఆల్లిద్దరూ సేయితులని గురుతుకొచ్చి కోపం పోయింది. పెద్ద కొడుకెనక్కి సూసేడు. సూసి ..మల్లీ రాంబాబు ఆల్ల నాన్నెనక్కి సూసి.. “ ఆల్లిద్దరూ..మాంచి సేయితులయ్యా..ఆడికి గడియారం లేపోయేతలికి ఈడిక్కూడా పెట్టుకోబుద్దయినట్టు లేదు. అంతుకే సెప్పకుండా పట్టూ పోయి ఇచ్చేసేడు. ఏమవదులే. ..దీన్ని మల్లీ తీస్కెల్లి ఆడికే ఇచ్చెయ్యి. సేతికెట్టేసుకోమను. నేనిచ్చేనన్జెప్పు. నేను తీసేస్కున్నాని తెలిత్తే మా సోంబాబు తెగ ఇదైపోతాడు. “ అని ఆ గడియారాన్ని రాంబాబు ఆల్ల నాన్న సేతికి తిరిగిచ్చేత్తా.. పెద్ద కొడుక్కేసి అదేపనిగా కాసేపలాగే సూసి.. “ ఈకాన్నించీ తమ్మునికేదైనా కొత్తదిగాని తెత్తే ఆడిక్కూడా తేరా..! ఒకల్లకి లేపోతే ఇంకోల్లు బాధపడతారు..” అన్నాడు నవ్వుతూ.. “ ..తెత్తాన్లే.!” అన్నాడు పెద్ద కొడుకు. సంతోసంగా ఆ గడియారాన్ని జాగరతగా జేబీలో ఎట్టుకుని ఇంటికేసి నడిసేడు రాంబాబు ఆల్ల నాన్న..
Publisher Information
Contact
molakanews@gmail.com
9848992841
H.NO. 1-9-319/1/1/G2, VIJAYADURGA RESIDENCY VIDYANAGAR,DIST-HYDERABAD-44
About
This is the children's page
Share this page
Email
Message
Facebook
Whatsapp
Twitter
LinkedIn
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి