పిల్లలూ,.. !మానవ శరీరంలోని ప్రతి అవయవం చాలా ముఖ్యమైనది.ప్రతి అవయవం దేనికదే ప్రత్యేకతకలిగి ఉంది.ఏ ఒక్క అవయవం పనిచేయక పోయినాఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి.అందుకే వాటిని ఎలాంటి సమస్యలు రాకుండా కాపాడుకోవాలి. ప్రస్తుతం మనం తినే ఆహారంలో పోషక విలువలు లేక,అనారోగ్యానికి గురవుతున్నాం.మనం తీనే ఆహారంలో కెమికల్ పాళ్లు ఎక్కువగా ఉంటున్నాయి. ప్రకృతి అందించే సహజ సిద్ధమైన ఆహార ధాన్యాలుఅందక ఎంతోమంది రకరకాల వ్యాధులతో బాధపడుతున్నారు.అది అలా వుంచి,మనం మన శరీరంలోనిఅవయవాల నిర్మాణం,అవి పని చేసే విధానం గురించి తెలుసుకుందాం.ఒక్కొక్క అవయవం నిర్మాణం ఎలా ఉంటుందో, అది ఎలా పని చేస్తుందో,ఒకవేళ ఏదైనా సమస్య వస్తే ఎలాంటి ఇబ్బందులుఎదుర్కోవాల్సి వస్తుందో, అన్ని విషయాలు వివరంగా తెలుసుకుందాం.శరీరంలోని ప్రతి అవయవం చాలా ముఖ్యమైనదే.ప్రస్తుతం మనం మూత్ర పిండాలు ( కిడ్నీలు),వాటి నిర్మాణం,అవి పనిచేసే విధానం, ఒకవేళ సరిగ్గా పనిచేయకపోతే వచ్చే సమస్యలగురించి మాట్లాడుకుందాం. మానవ శరీరంలో కిడ్నీలు చాలా ముఖ్యమైన అవయవాలు.చిక్కుడు గింజ ఆకారంలో వెన్నుపూసకు ఇరువైపులా,రిబ్స్ కు పై భాగంలో వుంటాయి.ముదురు ఎరుపు రంగులో వుండే ఈ కిడ్నీలపై శరీరంలోని అన్ని అవయవాలు ఆదారపడి వుంటాయి.అవి రక్తాన్ని శుద్ధిచేసే, శరీరంలోని వ్యర్థ పదార్థాలను బయటకుపంపిస్తాయి.అలా బయటకు పంపబడే వ్యర్థ పదార్థాలు నీటితో కలిసి మూత్రంలో బయటకు వెళుతాయి.మనం తినే ఆహారంలోనుంచితయారయ్యే వ్యర్థ పదార్థాలను బయటకు పంపడానికి నెఫ్రాన్ అనే ఫిల్టర్ వొడపోసి వ్యర్థాలనుమూత్రం ద్వారా బయటకు పంపిస్తుంది.-ప్రమోద్ కుమార్ ఆవంచ


కామెంట్‌లు