104.పదోన్నతి పై బదిలీ:: బెలగాం భీమేశ్వరరావు9989537835

కొత్త గేయాలు మరికొన్ని రాయాలనుకున్నాను.సముద్రం మనసులో తళుక్కుమంది.పిల్లల్లో పరకాయ ప్రవేశం చేసి గేయ రచన ఆరంభించాను.గేయ పాదాలు ఇలా సాగాయి.//సముద్రపొడ్డుకుసాయంకాలం/షికారుకెళ్ళాము/అవతలి గట్టూకనబడదేమని/ఎగురుతు చూశాము/నీలాకాశంసంద్రం నీరూ/కలసీపోయాయి/విశాల కడలీ పైపైనుండీ/గాలులు వీచాయి/హోరు హోరుమనిజలనిధి అలలూ/వడిగా ఉరికాయి/అలల తాకిడికి తడిసిన ఇసుకతొ/గూళ్ళను కట్టేము/పెద్ద అలలను చూచీ మేము/సంబరపడ్డాము/అలలరాజుకు వీడుకోలిచ్చి/ఇళ్ళకు చేరాము//ఈ గేయం లో సాధ్యమైనంత వరకు సముద్రంపర్యాయ పదాలను పరిచయం చేయడానికి
ప్రయత్నించాను.సముద్రం చూసి పిల్లలు పొందేఅనుభూతి ని గేయం లో పొందుపరిచాను.ఈ గేయం 2002 ఏప్రిల్ బాలభారతి పత్రిక లోచెలియలికట్ట పేరుతో వచ్చింది. బుజ్జాయి పిల్లలపత్రిక లో కథలతో పాటు అపుడపుడు గేయాలు ఇవ్వడం చూశాను. ఆ పత్రిక కు "అల్లరి అంజయ్య" అనే గేయం పంపేను. ఆ గేయాన్నిఒక అల్లరబ్బాయి చుట్టూ అల్లాను.ఈ గేయం లోమరొక ప్రయోగం చేశాను.గేయం లో అన్ని పాదాలు "అ" తో ప్రారంభించాను.ఆ గేయంచూద్దాం.//అల్లరి పిల్లడు అంజయ్య/ అలసీ ఇంటికి వచ్చాడు/అరిసెల వాసన వచ్చింది/అటుగ ఇటుగ చూశాడు/అమ్మా అక్కా ఇంట్లో లేరు/ అటక మీదకు ఎక్కాడు/అరిసెల బానను చూశాడు/అక్కడ కూర్చొని మెక్కాడు/అవ్వఅలికిడీ అయ్యింది/అటక మీంచీ జారాడు/అరిసెలు ఎక్కువ తిన్నాడు/అరగక నొప్పులుపడ్డాడు/అటుగ ఇటుగ దొర్లాడు/అరుగుతుందనితలచాడు/అక్క తమ్మునీ చూసింది/అమ్మతొ ఏదోచెప్పింది/అమ్మా వచ్చీ అడిగింది/అంతా నిజమేచెప్పాడు/అవ్వా కసరీ తిట్టింది/అల్లం మందూఇచ్చింది/అంజికి జీర్ణం అయ్యింది/అందరుపక పక నవ్వారు// ...పదాలు కూర్చడానికి కొంచెం ఇబ్బంది పడినా అ అక్షరంతో అన్నిపాదాలు రావడం నాకు తృప్తి కలిగించింది.ఈ గేయం 2002 ఏప్రిల్ బుజ్జాయి లో వచ్చింది.ఆరోగ్యంగా చురుకుగా పిల్లలుండడానికి మంచిఆహారం అవసరం. పిల్లలకది చెప్పడానికిమేలుబంతి అనే గేయం రాశాను.మేలుబంతిఅనే పదం ఆచరించ దగినదనే భావనతో ఉపయోగించాను.ఇక ఆ గేయం లోకి వెళ్దాం.//కందిపప్పు ఆవునెయ్యి ఆరగించు/బొద్దు గానుముద్దు గాను కనిపించు/ఆకుకూర కాయగూరతిను నీవు/రోగాలకు దూరంగా ఉండు నీవు/గడ్డపెరుగు అన్నంతో కలిపి తినుము/తెలివితేటలు నీపరం చేసుకొమ్ము/తీపి,పులుపు పండ్ల రసం రుచులు చూడు/ఆరోగ్య భాగ్యాన్ని పొందు నీవు/కాఫీలు టీలు మాని పాలు తాగు/రోజంతా హుషారుగ గడుపు నీవు/ఆటపాటలందు నీవుముందు వుండు/చదువు సంధ్య లందు నీవుఫస్టు రమ్ము// ఈ గేయం 2002 అక్టోబరు 27 వార్తఆదివారం అనుబంధం లో వచ్చింది.దుగరాజుపేటపాఠశాలకు వచ్చాక గేయరచనలు ఎక్కువే వచ్చాయి.చిన్న పిల్లల ఆలోచనలు, సరదాలు,ఇష్టాలు ఇవన్నీ పరిశీలన చేయడానికిఅక్కడ పనిచేసే రెండు సంవత్సరాలు ఉపయోగపడ్డాయి. ఆ ఆలోచనలు, సరదాలు,ఇష్టాలు అన్నీమూట కట్టుకొని 14 -11 - 2002 న స్కూల్ అసిస్టెంట్ గా పదోన్నతి పొంది శ్రీ తురుమళ్ళ రామమూర్తి మెమోరియల్ బాలికోన్నత పాఠశాల కు బదిలీ మీద చేరాను.30 సంవత్సరాలు 7వతరగతి లోపు పిల్లలతో ఉపాధ్యాయుడిగా సన్నిహితంగా మెలిగాను.ఇప్పుడు 8 నుంచి 10వతరగతి పిల్లలతో అనుబంధం ఏర్పడుతుంది.మరి ఈ పిల్లలు ఎటువంటి ఆలోచనలకు నాకుఆలవాలమవుతారో చూడాలి మరి అని అనుకున్నాను.(సశేషం)


కామెంట్‌లు