పసందైన బుజ్జి పాటల హరివిల్లు... ఉయ్యాల జంపాల(పుస్తక సమీక్ష)పుస్తక సమీక్షకుడు:-లిఖిత్ కుమార్ గోదా,ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం, మహాత్మా జ్యోతిభా ఫూలే తెలంగాణ బీసీ సంక్షేమ,గురుకుల కళాశాల బోనకల్ ,ఖమ్మం-50720---బుజ్జి పాటలమ్మా.. బుజ్జి పాటలు. పసందైన పల్లె పాటలు, పిల్లలు మెచ్చే ఆట"పాటలు", ఆహ్లాదాన్ని కలిగించే అందమైన పాటలు, పిల్లల మనసులను చురగొనే కొంటైన పాటలు, అందరినీ అలరించి, ఆకట్టుకునే అపురూపమైన పాటలు.పసిపిల్లలు బుజ్జి పాటలకి భలే తొందరగా ఆకర్షితులవుతారు. బుజ్జి పాటలంటే చెవి కోసుకొంటారు. అమ్మ ఒడిలో కూర్చుని అమ్మ పాడే"చిట్టి చిలకమ్మా అమ్మ కొట్టిందా?","చికుబుకు రైలు వస్తుంది.."వంటి పాటలు నుండి, స్కూల్లో టీచర్ లు చెప్పే రైమ్స్, పద్యాలు , పాటలు వరకూ ఊ ప్రతిదాన్ని చటుక్కున ఆకలింపు చేసుకుని ముద్దు ముద్దు స్వరాలతో, ముచ్చటైన పదాలతో అందంగా పాడుతుంటారు. సృజనకు తొందరగా ఆకర్షితిమయ్యే మనస్తత్వం పిల్లలది.అలాంటి పసి మనసులు తెలిసిన గంగాదేవు యాదయ్య గారు బాలల్లో తియ్యటి చిరునవ్వుల కోసం వారు పాడుకోదగిన బుజ్జి పాటలు ఎన్నో సృష్టించారు. ఆ పసి మనసు దోచే బుజ్జి పాటలు ఉన్న బంగారు పుస్తకమే ఈ "ఉయ్యాల.. జంపాల".గత 30 ఏళ్లు బోధనా శాస్త్రం లో నూతన పద్ధతులు రూపకల్పనా, వయస్సును, స్థాయిని, ఈ ప్రాంతాన్ని పరిగణలోకి తీసుకొని పాఠ్యాంశాలు తయారు చేస్తున్నారు యాదయ్య గారు. లిపిలేని కోయ, గోండి భాషల్లో బాల సాహిత్య సృజన కోసం శ్రీకారం చుట్టి ఆయా భాషల్లో మొదటి తరం రచయితలను వెలికి తీసి తమ కార్యశాల ద్వారా ఉత్సాహపరిచి మెరుగులు దిద్దుతున్నారు.కోయ భాషలో తెలుగు లిపితో 8 పుస్తకాలు, కొండరెడ్ల మాండలికంలో నాలుగు పుస్తకాలు రావడానికి సూత్రధారి యాదయ్య గారు. కోయ భాషలో బాల సాహిత్య సృజనను ఒక ఉద్యమంలా చేశారు. ఇవాళ అనేకమందికి కోయ పిల్లలు వారి మాతృభాషలో బాలగేయాలు పాడుకుంటున్నారు.ఈ ఉయ్యాల జంపాల బుజ్జి పాటల పుస్తకం లో పాటలు భలే గమ్మత్తుగా, పిల్లలను అలరిస్తూ, ఆకర్షిస్తూ కొత్త లోకానికి తీసుకుపోతాయి. కొన్ని బుజ్జి పాటలు నిత్యం ఇంటి దగ్గర, పరిసరాల దగ్గర జరిగే విషయాలే చెబుతూ "అరే నిజమే కదా! మనము ఎలా చేసుంటాం కదా అనుకుంటాం కదా"అని అబ్బురపడేలా చేస్తాయి.హా..హా.. ఆహా.. బుజ్జి పాటను ఒకసారి పరిశీలిద్దాం, "అమ్మ నీళ్లు తీస్తుంటే నేను కూడా తెస్తాను! అమ్మ వంటలు చేస్తుంటే ఆశ్చర్యంగా చూస్తాను! ఘుమ ఘుమ వాసన వస్తుంటే గుటకలు వేస్తూ ఉంటాను! వంటలు తయారు అవ్వంగానే అంతా స్వాహా చేసేస్తాను! శుభ్రంగా స్వాహా చేసేస్తాను ఆహా ఏమి ఆహారం!! - ఈ బుజ్జి పాటను పాడుతూ ఉన్నంతసేపు అమ్మ చుట్టూ తిరుగుతూ, అమ్మ చేసే వంట తరించి ఎవరు అలా చేయరు? అలాగే "వాన.. గానం" భలే గమ్మత్తుగా ఉంటుంది.. "పై నుండి వాన కింద నుండి నాన చెట్టు చేమ స్నానం ఆకు అలమా గానం"- నిజమే కదా. పై నుండి వాన పడుతుంది . కింద ఆ వర్షం వలన నేను నానుతోంది. చెట్టు చేమ ఆ వాన చినుకులతో తడిచి స్నానం చేస్తాయి. వాన చినుకులు ఆకుల మీద పడుతూ ఉంటే 'టపటప'మని శబ్దం వస్తుంటే అవి పాడుతున్నట్లే గోచరిస్తుంది. కొన్ని పాటలు భలే నవ్వులు కురిపిస్తాయి.మొదట గొప్పతనం చెప్పినట్లే చెప్పి తరువాత గాలి తీసినంత పని చేసి నవ్విస్తూ ఉంటాయి. అలాంటిదే ఈ "అనగనగా రాజు".. "అనగనగా రాజు కొడతాడు పెద్ద ఫోజు మూరెడు మూరెడు మీసాలు బారెడు బారెడు గడ్డాలు గుర్రాల మీద సవారి పులిని చూస్తే ఫరారీ"- నవ్వుకోడానికి పసందైన బుజ్జి పాట ఇది. ఇట్లాంటివి మన బడి పిల్లల నోట్లో కోకొల్లలు. "నీకేం తెలుసు నిమ్మకాయ పులుసు" అన్నట్లు సాగుతోందీ "నాగలి..అరక" పాట, "భూమిని దున్నే బురుక ఎద్దులు లాగితే ఉరుక దున్నలు లాగితే బరుక దున్నిన వానికే ఎరుక దున్నని వారికి ఏమెరుకా?" అంటూ హాస్యాస్పదంగా ఉన్నప్పటికీ ఇందులో రైతన్న కష్టం ,దానికి పశువుల తోడ్పాటు గురించి ఒకింత అస్త్ర ప్రయోగం జరిగినట్లు తెలుస్తుంది. ఇది ఆనందం కోసమే కాదు ఆలోచించాల్సిన బుజ్జిపాట కూడా. "నేను పోత ఢిల్లీ"లో- "కొణిదెస కొణిజెర్ల కొణిజేడు కొడిగెనవాల్లి ఆపు.. ఆపురా.. నీ లొల్లి నే.. వెళుతున్నారా.. ఢిల్లీ నే వచ్చానంటే చేస్తాను రా నీ పెళ్లి"- అని పాడుకుంటూ ఉంటే పిల్లలు గొడవలు పెట్టుకుని "నీ పెళ్ళికి డొక్కు లారీ" అనుకున్నట్లు నవ్వొస్తుంది. "చెక్కెరకేళి" లో పండుగ హోళీ తినేది గోళీ కొట్టేది డోలీ నమ్లేది పోలి రాకండి నా జోలి"-అంటూ కొంటెగా బుడుగులు కుదిరి కుదరక చూపుడు వేలుతో ముందుకి వెనక్కి అంటూ ముఖంలో కోపాన్ని ప్రదర్శిస్తూ అన్నట్లు ఉంది కదూ. ఇట్లాంటి పాటలు ఎన్నో మనకి ఉయ్యాల జంపాల పుస్తకాలు పొందుపరిచారు రచయిత. పిల్లలూ! మనం ఈ పుస్తకాన్ని చదివి అటు హాస్యాన్ని, ఇటు ఆలోచనాశక్తిని పెంచుకుని కల్మషం లేని మనుషులుగా, సమాజంపై అవ్యాజమైన ప్రేమను ఒలికిస్తూ అందమైన ప్రపంచాన్ని సృజించు కుందాం. ఏమంటారు బుడుగు లారా! అల్లరి పాపల్లారా!" పండే"నా?.
Popular posts
మహాభారతంలో ధర్మరాజుకు వాడిన పేర్లు.: -డా.బెల్లంకొండనాగేశ్వరరావు.
• T. VEDANTA SURY
ఏం కాలం? ఇది పోయే కాలం!:- యలమర్తి అనూరాధ
• T. VEDANTA SURY

తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
• T. VEDANTA SURY
*బహు చక్కని కథలు బక్రిచెప్యాల బాదుషాలు*:- బట్టల సాయిచరణ్-7వ, తరగతి -జి.ప.ఉ.పా.బక్రిచెప్యాల -మం:సిద్ధిపేట -జాల్లా:సిద్ధిపేట
• T. VEDANTA SURY

ఆలోచనల రూపం!!?- డా ప్రతాప్ కౌటిళ్యా
• T. VEDANTA SURY

Publisher Information
Contact
molakanews@gmail.com
9848992841
H.NO. 1-9-319/1/1/G2, VIJAYADURGA RESIDENCY VIDYANAGAR,DIST-HYDERABAD-44
About
This is the children's page
Share this page
Email
Message
Facebook
Whatsapp
Twitter
LinkedIn
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి