ఆడవారికే గుండె జబ్బులు ఎక్కువ ; ప్రమోద్ ఆవంచ

ఇండియాలో మగవారి కన్నా ఆడవారికి గుండె జబ్బులు ఎక్కువగా వస్తున్నాయి.గుండె జబ్బులు మహిళలకు  చాలా నిశ్శబ్దంగా వ్యాప్తి చెందుతున్నాయి.సాధారణంగా ఉద్యోగాలు చేసే మహిళలు ఇటు ఇంట్లోనూ, అటు ఆఫీసు లోనూ పని భారంఎక్కువ కావడంతో మానసిక ఒత్తిడికి గురికావడం జరుగుతుంది.సరైన పోషకాహారం తీసుకోకపోవడం, మరియు ఆహార నియమాలు పాటించకపోవడం వల్ల గుండెకు సంబంధించిన సమస్యలు అధికంగా వస్తున్నాయి.మగవాళ్ళలో హార్ట్ ఎటాక్ వచ్చినప్పుడు గుండె వ్యాధులను గుర్తించే అవకాశం ఉంటుంది.కానీ మహిళల్లో హార్ట్ ఎటాక్ చాలా తక్కువగా వస్తుంది.వాళ్ళు ఎక్కువగా అలసిపోవడం వల్ల శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడడం, వాంతులు అవుతున్నట్లు అనిపించడం, కడుపులో,మెడ, భుజం భాగాలలో నొప్పి రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.ఈ లక్షణాలు తీవ్రంగా వుండకపోవడం వల్ల నిర్లక్ష్యం చేస్తారు.ప్రస్తుత పరిస్థితులలో మహిళల జీవన విధానంలో ఒత్తిడి అధికమై 50 శాతం మహిళా ఉద్యోగులకు హార్ట్ ఎటాక్ లు వస్తున్నాయి.మామూలుగా మగవారి కన్నా మహిళలలో కొరోనరీ ఆర్టరీలు చిన్నగా, పలుచగా వుంటాయి.అందువల్ల వారికి ఆంజియోగ్రామ్, ఆంజియోప్లాస్టీ,కొరొనరీ ఆర్టరీ బైపాస్ గ్రాఫ్టింగ్, సర్జరీలు చేయడం చాలా కష్టం.వ్యాధి లక్షణాలను గుర్తించడం, సర్జరీ అయిన పేషెంట్లలో మంచి రిజల్ట్ రావడం తక్కువగా ఉంటుంది.మిగితాది రేపు.....


కామెంట్‌లు