నేటి ప్రపంచంలో పిల్లలను తల్లిదండ్రులు అతి గారాబంగా పెంచుతున్నారు. దీనికి ప్రత్యేకత అయినటువంటి కారణం ఏంటంటే వారు ఉన్నత హోదాలో ఉన్నామని ఉన్నత హోదాకు తగ్గట్టుగా వారిని దేనికీ లోటు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలని తల్లిదండ్రులు అనుకుంటున్నారు. కష్టం అంటే ఎలా ఉంటుందో తెలియని స్థితిలో వారిని పెంచడం వల్ల వారు రేపు వచ్చే సమస్యలను ఎదుర్కొనే శక్తి ఉండదని గమనించలేక పోతున్నారు. దీనికి అంతటికీ ప్రధానమైన కారణం తల్లిదండ్రులు పిల్లలకు ఇచ్చే క్రమశిక్షణ నే...
మరో విషయం చెప్పాలంటే తన బంధువులు లో గాని చుట్టుపక్కల కానీ ఎవరైనా తమ పిల్లలను ఎక్కువ ఫీజులు చెల్లించి పాఠశాలలో చేర్పిస్తే వారు ఉన్నతంగా పెద్ద హోదాలో చదువుకుంటారని భావిస్తున్నారు. కానీ ఆ విధంగా జరగటం లేదు. పిల్లలలో ఉన్న సృజనాత్మకతను బయటకు తీసి వారికి తగిన శిక్షణ ను ఏ విధంగా ఇప్పించాలి అని తెలుసుకున్నప్పుడే వారి యొక్క భవిష్యత్తుకు మనుగడ ఉంటుందని తల్లిదండ్రులు గమనించాలి.
ఇదిలా ఉండగా పరిసర ప్రాం తీయ పరిస్థితుల యొక్క ప్రభావం పిల్లలపై కూడా పడుతుంది. మన చుట్టుపక్కల ఉన్న పిల్లలు ఏ విధంగా ముందుకు వెళ్తున్నారు. వారు ఎంత వరకు విద్యలో రాణిస్తున్నారు అనే విషయాన్ని పరిశీలించి ఆ పిల్లల యొక్క ఆలోచన విధానం ఏ విధంగా ఉందో ఓ కంట కనిపెడుతూ మన పిల్లలను వారితో ఏ విధంగా అసోసియేట్ చేయాలి అనే విషయం తెలియాలి ఈ విషయమై ప్రత్యేక శ్రద్ధ తల్లిదండ్రులదే.....
ఇక ఇప్పుడు కరోనా వలన ఆన్లైన్ క్లాసులు అంటూ కొంత వరకు జరుగుతున్నాయి. మరి ఎంత వరకు ఫలితాలు ఈ క్లాసుల వల్ల ఉంటాయో వేచి చూడాల్సిందే మరి..
పిల్లల బంగారు బాట కు బాసటగా ఉందాం.--చిటికెన కిరణ్ కుమార్... సెల్.. 9490 84 1284.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి