అపజయాలకు జేజేలు!
నాలో..సాధించాలనే కసిని రగిలిస్తున్నందుకు.
క(న)ష్టాలకు ప్రణామాలు!
నాలో..వాటిని అధిగమించాలనే తపనను కలిగిస్తున్నందుకు.
సమస్యలకు సెల్యూట్!
నాలో..పోరాడే శక్తిని ప్రేరేపిస్తున్నందుకు.
.తిరస్కారాలకు సత్కారాలు!
నన్ను పురస్కారాలకై పురికొల్పుతున్నందుకు.
విమర్శ(కు)లకు వినమ్రతలు!
నన్ను సరి చే(చూ)స్తున్నందుకు.
ఆశ(యా)లకు అభినందనలు!
నన్ను జీవింపజేస్తున్నందుకు.
అక్షరాలకు అభివందనలు!
నన్ను వెలిగిస్తున్నందుకు.
అభినందన-అభివందన--: - బాలవర్ధిరాజుమల్లారం
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి