వ్యాయామం--కె ఎస్ అనంతాచార్య.-- సూర్యోదయo కన్నా పూర్వమే మైదానం నిండా కసరత్తులు కోచ్ ల సెమినార్ల కోలాహలం నూతనోత్తేజం కోసం ప్రాణిపడే పాట్లు రన్నింగ్ లో ఫీట్లు ఎమోషన్స్ లాగేసే సుదర్శన క్రియ డిప్రెషన్స్ పారద్రోలే నిదర్శన క్రియ ఎవరి ప్రణాళిక వారిదే జీవక్రియల అదుపు తీపి నియంత్రణ రేఖ మీద రెఫ్రీల విజిల్స్ హైపర్ టెన్షన్ మీద హై అలెర్ట్ పెరిగే బీ ఏం ఆర్ రేటుకు చెక్ వాకింగ్ ట్రాక్! ధనం చెల్లించకుంటే సుఖం దొరకదు కాలరీలు ఖర్చు చేయకుంటే ఆరోగ్యం లేదు కాయం కదిలించక పోతే ఊబకాయంచేసే గాయాలెన్నో వయసుడిగి వ్యాధి ముదిరి సేవించే ఔషధo కాదు చేసుకున్న వారికి చేసుకున్నంత శారీరక యంత్రo స్వస్థతను నెలకొల్పే ఆరోగ్య మంత్రం మంచి తలపును మించిన మానసిక వ్యాయామం మరొకటి లేదు వ్యాయామం అన్ని శరీరావయవాలకు చేసే సమన్యాయం


కామెంట్‌లు