జ:- వాల్మీకి.2.ప్ర: వాల్మీకి మహర్షికి రామాయణ గాథను ఉపదేశించిన ముని ఎవరు?జ:- నారదుడు.3.ప్ర: రామకథను వినిన తర్వాత వాల్మీకి మహర్షి, మధ్యాహ్న స్నానానికి ఏ నదికి వెళ్లాడు?జ:- తమసా నది.4.ప్ర: శ్రీమద్రామాయణంలో మొత్తం ఎన్ని శ్లోకాలు వున్నాయి?జ:- 24,000.5.ప్ర: శ్రీమద్రామాయణాన్ని గానము చేస్తూ మొదట ప్రచారం చేసిందెవరు?జ:- కుశలవులు.6.ప్ర: అయోధ్యా నగరం ఏ నది ఒడ్డున ఉన్నది?జ:- సరయూ నది.7.ప్ర: అయోధ్య ఏ దేశానికి రాజధాని?జ:- కోసల రాజ్యం.8.ప్ర: దశరథ మహారాజుకు ఆంతరంగికుడైన మంత్రి ఎవరు?జ:- సుమంత్రుడు.9.ప్ర: దశరుథుని భార్యల పేర్లు ఏమిటి?జ:- కౌసల్య, సుమిత్ర, కైకేయి.10.ప్ర: సంతానం కోసం దశరథుడు చేసిన యాగం పేరు?జ:- పుత్రకామేష్ఠి.11.ప్ర: యజ్ఞకుండమునుండి వెలువడిన దివ్య పురుషుడు ఇచ్చిన పాయసాన్ని దశరథుడు తన భార్యలకు ఎట్లు పంచెను?జ:- కౌసల్యకు 50%, సుమిత్రకు 25%, కౌకేయికి 12.5%, మిగిలిన 12.5% మళ్లీ సుమిత్రకు.12.ప్ర: బ్రహ్మదేవుని ఆవలింత నుండి పుట్టిన వారెవ్వరు?జ:- జాంబవంతుడు.13. ప్ర: వాలి ఎవరి అంశతో జన్మించెను?జ:- దేవేంద్రుడు.14.ప్ర: వాయుదేవుని వలన జన్మించిన వానరుడెవరు?జ:- హనుమంతుడు.15.ప్ర: కౌసల్య కుమారుని పేరేమిటి?జ:- శ్రీరాముడు.16.ప్ర: భరతుని తల్లి పేరేమిటి?జ:- కైకేయి.17.ప్ర: రామలక్ష్మణ భరత శత్రుఘ్నలలో కవలలు ఎవరు వారి తల్లి పేరేమిటి?జ:- లక్ష్మణ, శత్రుఘ్నులు- తల్లి సుమిత్ర.18.ప్ర: రామలక్ష్మణ భరత శత్రుఘ్నులకు నామకరణము చేసిన మహర్షి ఎవరు?జ:- వసిష్ఠుడు.19.ప్ర: విశ్వామిత్రుడు వచ్చేనాటికి రాముని వయస్సు?జ:- 12 సంవత్సరములు.20.ప్ర: విశ్వామిత్రుని యజ్ఞానికి విఘ్నాలను కల్పిస్తున్న రాక్షసులెవరు?జ:- మారీచ, సుబాహులు.21.ప్ర: రామునికి అలసట, ఆకలి లేకుండా వుండుటకు విశ్వామిత్రుడు ఉపదేశించిన మంత్రం పేరేమిటి?జ:- బల-అతిబల.22.ప్ర: విశ్వామిత్రుని ఆశ్రమం పేరు?జ:- సిద్ధాశ్రమం.23.ప్ర: తాటక భర్త పేరేమిటి?జ:- సుందుడు.24.ప్ర: తాటకను శపించిన మహర్షి ఎవరు?జ:- అగస్త్యుడు.25.ప్ర: గంగను భూమికి తెచ్చుటకు తపస్సు చేసినదెవరు?జ:- భగీరథుడు.26.ప్ర: గంగకు జాహ్నవి అనే పేరు ఎందుకు వచ్చెను?జ:- జహ్ను మహర్షి చేత త్రాగివేయబడుటచే.27.ప్ర: అహల్య భర్త ఎవరు?జ:- గౌతమ మహర్షి.28.ప్ర: జనక మహారాజు ఆస్థాన పురోహితుడెవరు?జ:- శతానందుడు.29.ప్ర: సీత ఎవరికి జన్మించెను?జ:- నాగటి చాలున జనకునికి దొరికెను.30. ప్ర: శివుడు తన ధనుస్సును ఏ మహారాజు వద్ద వుంచెను?జ:- దేవరాతుడు.31.ప్ర: శివధనుస్సును తయారు చేసినదెవరు?జ:- విశ్వకర్మ.32.ప్ర: భరత శత్రుఘ్నల భార్యల పేర్లు?జ:- మాండవి, శృతకీర్తి.33.ప్ర: లక్ష్మణుని భార్యయైన ఊర్మిళ తండ్రి ఎవరు?జ:- జనకుడు.34.ప్ర: జనకుడి తమ్ముడి పేరు ఏమిటి?జ:- కుశధ్వజుడు.35.ప్ర: పరశురాముడు శ్రీరామునికి యిచ్చి ఎక్కుపెట్టమన్న ధనుస్సు పేరేమిటి?జ:- వైష్ణవ ధనుస్సు.36.ప్ర: భరతుని మేనమామ పేరు ఏమిటి?జ:- యధాజిత్తు.37.ప్ర: దశరధుని వరాలు కోరమని కైకను ప్రేరేపించినదెవరు?జ:- మంధర.38.ప్ర: కైక దశరథుణ్ణి వరాలు కోరినపుడు భరతుడెచట వుండెను?జ:- గిరివ్రజపురం, మేనమామ యింట.39.ప్ర: రాముని మిత్రుడు గుహుడు వుండే ప్రాంతమేది?జ:- శృంగిబేరపురం.40.ప్ర: సీతారాములు తమ వనవాసం మొదటిరోజు రాత్రి ఏ వృక్షం క్రింద నిద్రించెను?జ:- గారచెట్టు.41. ప్ర: శ్రీరాముని వనవాసమునకు చిత్రకూటము తగినదని సూచించిన ముని ఎవరు?జ:- భారద్వాజ ముని.42.ప్ర: పర్ణశాలకు సమీపములోని నది పేరేమిటి?జ:- మాల్యవతీ.43.ప్ర: దశరథుని శవమును భరతుడు వచ్చే వరకు ఏడు రోజులపాటు ఎక్కడ భద్రపరిచారు?జ:- తైలద్రోణములో.44.ప్ర: శ్రీరామునితో నాస్తికవాదన చేసినదెవరు?జ:- జాబాలి.45.ప్ర: భరతుడు రాముని పాదుకలనుంచిన పట్టణమేది?జ:-నంది గ్రామము.46. ప్ర: అత్రిమహాముని భార్య ఎవరు?జ:-.అనసూయ.47.ప్ర: దండకారణ్యంలో రామలక్ష్మణులను ఎదుర్కొన్న మొదటి రాక్షసుడెవరు?జ:- విరాధుడు.48.ప్ర: పంచవటిలో నివసింపుమని రామునికి సలహా ఇచ్చినదెవరు?జ:- అగస్త్యుడు.49. ప్ర: పంచవటి ఏ నదీతీరమున ఉన్నది?జ:- గోదావరి.50. ప్ర: లక్ష్మణుడు ఎవరి చెవులు ముక్కు కోసెను?జ:- శూర్ఫణఖ.51.ప్ర: ఖరదూషణాది పదునాలుగు వేల మంది రాక్షసులు ఎక్కడినుండి పంచవటికి వచ్చెను?జ:- జనస్థానము.52.ప్ర: సీతను అపహరించుటకు రావణుడు ఎవరి సహాయము కోరెను?జ:- మారీచుడు.53.ప్ర: సీత రాముడిని కోరిన మాయా మృగం ఏది?జ:- బంగారులేడి.54.ప్ర: సీతను తీసుకుపోతున్న రావణునితో యుధ్ధము చేసిన పక్షి ఎవరు?జ:- జటాయువు.55.ప్ర: సీతను అన్వేషించుచున్న రామలక్ష్మణులకు అరణ్యములోని మృగములు ఏ దిక్కుకు సంకేతము చూపెను?జ:- దక్షిణపు దిక్కు.56.ప్ర: సీతాన్వేషణలో వున్న రామలక్ష్మణులు ఏ రాక్షసుని హస్తములలో చిక్కుకొనెను?జ:- కబంధుని.57.ప్ర: సీతాన్వేషణలో రామలక్ష్మణులు చేరుకున్న శబరి ఆశ్రమం ఏ నదీ తీరాన, ఏ వనంలో వున్నది?జ:- మతంగ వనం, పంపానదీ.58.ప్ర: సుగ్రీవాదులు ఏ పర్వత ప్రాంతంలో నివసించు చుండెను?జ:- ఋష్యమూక పర్వతం.59.ప్ర: రామలక్ష్మణులను గురించి తెలుసుకొనుటకై వారివద్దకు సుగ్రీవుడు ఎవరిని పంపెను?జ:- హనుమంతుడు.60.ప్ర: రామసుగ్రీవుల మైత్రి ఎవరి సాక్షిగా జరిగెను?జ:- అగ్ని సాక్షిగా.61.ప్ర: రాముడు తన బాణములు దేనితో తయారు చేయబడినవని సుగ్రీవునికి చెప్పెను?జ:- కుమారస్వామి జనించిన వనములోని బంగారు కాండములు.62.ప్ర: సుగ్రీవుని భార్య పేరు?జ:- రుమ.63.ప్ర: వాలి భార్యపేరు?జ:- తార.64.ప్ర: వాలి సుగ్రీవుల రాజ్యము పేరేమిటి?జ:- కిష్కింధ.65.ప్ర: వాలిని కవ్వించి పారిపోయి బిలంలో దాక్కున్న రాక్షసుడు పేరేమిటి?జ:- మాయావి.66.ప్ర: హిమవంతుని సలహాతో వాలితో యుద్ధానికి వచ్చిన రాక్షసుడు ఎవరు?జ:- దుందుభి.67.ప్ర: వాలి విసిరిన దుందుభి కళేబరం ఎవరి ఆశ్రమంలో పడెను?జ:- మతంగముని.68.ప్ర: వాలి కుమారుని పేరేమిటి?జ:- అంగదుడు.69.ప్ర: రాముడు ఒకే బాణంతో ఎన్ని సాలవృక్షములను భేదించెను?జ:- ఏడు.70.ప్ర: సుగ్రీవుని రాజ్యాభిషేకము తర్వాత రామలక్ష్మణులు ఎక్కడ నివసించెను?జ:- ప్రసవణగిరి.71.ప్ర: సీతాన్వేషణ కోసం సుగ్రీవుడు *తూర్పు* దిక్కుకు పంపిన వానర సేనకు నాయకుడెవరు?జ:- వినతుడు.72.ప్ర: సీతాన్వేషణ కోసం సుగ్రీవుడు *దక్షిణ* దిక్కుకు పంపిన వానర సేనకు నాయకుడెవరు?జ :- అంగదుడు.73.ప్ర: సుగ్రీవునికి, సీతాన్వేషణ కోసం *పశ్చిమ* దిక్కుకు పంపబడిన సుషేణునికి బంధుత్వమేమిటి?జ:- మామగారు, తార తండ్రి.74.ప్ర: సీతాన్వేషణ కోసం సుగ్రీవుడు *ఉత్తర* దిక్కుకు పంపిన వానర సేనకు నాయకుడెవరు?జ- శతబలుడు.75.ప్ర: సీతాన్వేషణ కోసం సుగ్రీవుడు వానరులకు ఎంత సమయం గడువిచ్చెను?జ:- మాసం (ఒక నెల).76.ప్ర: హనుమంతుడు ఏ దిక్కుకు వెళ్లిన వానరసేనలో వుండెను?జ:- దక్షిణ దిక్కు.77.ప్ర: సీతకు ఆనవాలు కొరకై రాముడు హనుమంతునికి ఏమిచ్చెను?జ:- తన (రామ) పేరు చెక్కబడిన ఉంగరము.78.ప్ర: హనుమంతుడు మొదలైన వానరులు చిక్కుకున్న బిలం (లోయ)లో వున్న తాపసి పేరేమిటి?జ:- స్వయంప్రభ.79. ప్ర: సముద్రమవతల వున్న రావణునిని, సీతను చూడగల్గుతున్నానని వానరులకు చెప్పిన పక్షి పేరేమిటి?జ:- సంపాతి.80.ప్ర: హనుమంతుని తల్లి యైన అంజన అసలు పేరు?జ:- పుంజికస్థల.81. ప్ర: హనుమంతుడు సముద్రమును లంఘించుటకు ఎక్కిన పర్వతం పేరేమిటి?జ:- మహేంద్రపర్వతము.82.ప్ర: హనుమంతుడు సముద్రం దాటుతున్నపుడు విశ్రమించమంటూ ఆతిధ్యమిచ్చిన పర్వతం ఎవరు?జ:- మైనాకుడు.83.ప్ర: హనుమంతుని శక్తిని పరీక్షించుటకు దేవతలు సముద్రంలో నియమించిన నాగమాత పేరేమిటి?జ:- సురస.84.ప్ర: హనుమంతుని నీడను ఆకర్షించి హనుమంతుని తనవైపు లాగిన సముద్ర జంతువు పేరేమిటి?జ- సింహిక.85.ప్ర: హనుమంతుడు లంఘించిన సముద్రం పొడవెంత?జ:- నూరు యోజనములు.86.ప్ర: లంకలో హనుమంతుడు దిగిన పర్వతం పేరేమిటి?జ: లంబ పర్వతం.87.ప్ర: హనుమంతుడు సీతను కనుగొన్న వనం పేరేమిటి?జ;- అశోక వనం.88. ప్ర: రావణుడు సీతకు ఎన్ని మాసములు గడువిచ్చెను?జ:- రెండు.89.ప్ర: రామునకు విజయము, రాక్షసులకు వినాశము వచ్చునని కలగన్న రాక్షస స్త్రీ ఎవరు?జ:- త్రిజట.90. ప్ర: హనుమంతుడు చెట్టుపై దాగివుండి సీతకు వినబడునట్లు ఎవరి కథ వినిపించెను?జ- రామ కథ.91.ప్ర: రామునికి నమ్మిక కలుగుటకై సీత హనుమంతునికి యిచ్చిన ఆభరణం పేరేమిటి?జ:- చూడామణి.92.ప్ర: హనుమంతుడు లంకలో ఎంతమంది రావణుని కింకరులను వధించెను?జ:- ఎనభై వేలమంది.93. ప్ర: హనుమంతుడు ఎవరి అస్త్రముచే బంధింపబడి రావణుని వద్దకు పోయెను?జ:- ఇంద్రజిత్తు సంధించిన బ్రహ్మాస్త్రం.94.ప్ర: దూతను వధించుట తగదని రావణునికి బోధించినదెవరు?జ:- విభీషణుడు.95. ప్ర: తిరిగి వచ్చిన హనుమంతునితో కలసి వానరులు ఆనందంతో ధ్వంసం చేసిన సుగ్రీవునికి యిష్టమైన వనం పేరేమిటి?జ- మధువనం.96. ప్ర: వానరులు వనం ధ్వంసం చేస్తున్న విషయం సుగ్రీవునికి చేరవేసిన దెవరు?జ:- మధువన రక్షకుడూ, సుగ్రీవుని మేనమామ ఐన దధిముఖుడు.97. ప్ర: సీత జాడ తెలుసుకుని వచ్చిన హనుమంతునికి రాముడిచ్చిన బహుమతి?జ:- ఆలింగన సౌభాగ్యం.98. ప్ర: సముద్రం దాటుటకు నూరు యోజనములు సేతువు నిర్మించిన వానర ప్రముఖుడి పేరేమిటి?జ:- నీలుడు.99. ప్ర: ఇంద్రజిత్తు ఏ ప్రదేశంలో హోమం చేయుచుండగా లక్ష్మణుడు వధించెను?జ:- నికుంభిల.100. ప్ర:- మునికి ఆదిత్యహృదయం స్తోత్రమును ఉపదేశించిన ముని ఎవరు?జ:- అగస్త్యుడు.101.ప్ర: రావణుని వధించుటకు రామునికి రథం పంపినదెవరు?జ:- ఇంద్రుడు.102.ప్ర: రామ రావణ యుద్ధంలో రాముని రథసారధి ఎవరు?జ:- మాతలి.103.ప్ర: రావణ వధానంతరం లంకనుండి సీతారామ లక్ష్మణ వానరులతో బయలుదేరిన పుష్పకవిమానం అయోధ్య చేరేలోపు ఎక్కడ, ఎవరికోసం ఆగుతుంది?జ:- కిష్కింధలో, వానరుల భార్యలు కూడా పుష్పకవిమానంలో ఎక్కడం కోసం!104.ప్ర: గుహునికి, భరతునికి తన రాకను తెలియచేయుటకు శ్రీరాముడు ఎవరిని ముందుగా పంపెను?జ:- హనుమంతుడు.105.ప్ర: అయోధ్యలో సీతారాముల ఊరేగింపు సమయంలో సుగ్రీవుడు ఎక్కిన ఏనుగు పేరేమిటి?జ:- శత్రుంజయం.106. ప్ర: శ్రీరాముడు అయోధ్యలో సుగ్రీవునికి అతిధి గృహంగా ఎవరి భవనము నిచ్చెను?జ:- స్వయంగా తన భవనమునే యిచ్చెను.107.ప్ర: పట్టాభిషేక సమయంలో శ్రీరామునికి అలంకరించిన కిరీటం పూర్వం ఎవరిచే తయారు చేయబడినది?జ:- బ్రహ్మ.108.ప్ర: శ్రీరామ పట్టాభిషేకం తర్వాత సీతాదేవి హనుమంతునికిచ్చిన బహుమతి ఏమిటి?జ:- తన మెడలోని ముత్యాలహారం.
రామాయణం నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి