బతుకమ్మ వచ్చేను
సంబరాలు తెచ్చెను
చిన్న పెద్దలంత కలిసి
గౌరి పూజచేసెను
వేకువనే లేచాము
అడవిలోకి వెళ్ళాము
పువ్వునంత తీసుకొచ్చి
వేరు చేసి పెడతాము
అందరము చేరుతాం
పువ్వంత తెంపుతాం
కట్టలేన్నొ కట్టియు
బతుకమ్మ పేర్చుతాం
వాడలందు నిలుపుదాం
పాటలెన్నొ పాడుదాం
పాడినంక తీసుకొని
చెరువులోన వేయుదాం
వయనాలను పంచాము
ఫలహారము తిన్నాము
పాటలెన్నొ పాడుకుంటు
పరవశించి పోయాము
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి