వివిధ మణిపూసలు:--ఆరేటి శిరీష-10వ, తరగతి-ZPHS:గుర్రాలగొంది-జిల్లా:సిద్ధిపేట-చరవాణి:9704865816
ఉదయము నిద్ర లేచితిని
పండ్లు బాగా తోమితిని
అమ్మ చాయి పోయ గాను
చక్కగ నేను తాగితిని

స్నానం చేసి వచ్చాను
ఉతికిన బట్టలేశాను
స్నేహితులను కలుసుకొని
త్వరగా బడికి పోయాను

ప్రార్థన గంట కొట్టారు
బడికి అందరు వచ్చారు
ప్రతిజ్ఞ మేము చేయగా
తరగతి గదికి వెళ్లారు.

పాఠము సారు చెప్పారు
శ్రద్ధగ బాలలిన్నారు
సారు బయటకు వెళ్లగను
ముచ్చట్లంత పెట్టారు

ఆదివారం వచ్చింది
ఆనందాన్ని తెచ్చింది
త్వరగ ఇంటికి రాకుంటె
అమ్మ మమ్ముల తిట్టింది.

అమ్మమ్మ వచ్చింది
పండ్లెనే తెచ్చింది
అందరము తిన్నాము
బలము మాకు వచ్చింది.

బడికి పోయి వచ్చినాను
బ్యాగు పక్కకు పెట్టాను
కాళ్ళు చేతులు కడిగుకొని
అన్నము నేను తిన్నాను

మంచి చదువులు చదివాను
పరీక్ష లన్ని రాశాను
పేపర్లన్ని  దిద్ధగా
మార్కు లెన్నో పొందాను

ఉదయం నిద్ర లేచాను
పుస్తకమునే పట్టాను
పాఠము లన్ని చదివాక
ఇంటి పనులను చేశాను

హోంవర్కును చేశాను
ఆటలన్ని ఆడాను
రాత్రి బాగా చదువుకొని
నిద్రనేను పోయాను.


కామెంట్‌లు