శ్రీ కృష్ణ శతకము - పద్యం (౩౬ - 36)

 కందము :
*అగణిత వైభవ కేశవ*
*నగధర వనమాలి యాది | నారాయణ యో*
*భగవంతుఁడ శ్రీమంతుఁడ*
*జగదీశ్వర శరణు శరణు | శరణము కృష్ణా !* 
తా.: ఓ రుక్మిణీ నాధా, సత్యా వల్లభా, గోపికాలోలా..
నీకున్న సంపదను లెక్కింప ఎవరితరమూ కాదు. కేశి అను రాక్షసుని చంపి కేశవుడవు అయినావు.  గోవర్ధన పర్వతాన్ని ఎత్తి గోకులమును కాపాడినావు.  పూవుల మాలలను ధరించిన వాడవు.  సకల సృష్టి కి ఆధారమైన ఆది నారాయణుడవు.  లక్ష్మి పతివి.  ముమ్మాటికీ, ఇంతటి ఘనమైన నీవే మాకు రక్ష......అని  శతకకారుడు నృసింహ కవి వాక్కు.
.....ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss
కామెంట్‌లు