కందము :
*కెరలి యరచేత కంబమున్*
*నరదుగ వేయుటను వెడలి | యసురేశ్వరునిన్*
*ఉదరము జీరి వధించితివి* *నరహరి రూపావతార | నగధర కృష్ణా !*
తా.: ఓ రుక్మిణీ నాధా, సత్యా వల్లభా, గోపికాలోలా..
కొండను ధరించినవాడా, నగధరా, కృష్ణా! హిరణ్యకశిపుడు, ప్రహ్లాదుని దండించాలని అనుకుని, నువ్వు రోజూ కొలిచే ఆ హరి ఈ స్థంబంలో ఉన్నాడా ఉంటే చూపించు. రమ్మను బయటకు. అని స్తంభాన్ని చేతితో గట్టిగా కొట్టగానే, ఆ స్తంభాన్ని చీల్చుకుని నరసింహ రూపంతో వచ్చి, నీ వాడి చేతి గోళ్ళతో హిరణ్యకశిపుని సంహరించావు కదా......అని శతకకారుడు నృసింహ కవి వాక్కు.
*మహానుభావా, కరుణాసింధూ, నీ భక్తులను రక్షించడానికి నీవు వేయని వేషాలు, ఎత్తని అవతారాలు వున్నాయా, స్వామీ. నీ భక్తుడైన ప్రహ్లాదుని మాట కాపాడడానికి మనిషివి కాక, జంతువివి కాక, నరహరిగా వచ్చావు కదా!*
.....ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి