కందము :
*ఇరువ దొకమారు నృపతుల*
*శిరములు ఖండించితౌర | చే గొడ్డంటన్*
*ధర గశ్యపునకు నిచ్చియు*
*బరగవె జమదగ్ని రామ | భద్రుఁడు కృష్ణా !*
తా.: ఓ రుక్మిణీ నాధా, సత్యా వల్లభా, గోపికాలోలా..
జమదగ్ని మహర్షి కి పరశురాముడవై పుట్టి, ఈ భూముని క్షత్రియ శూన్యం చేయాలని తలచి, ఇరవై ఒక్క సార్లు బూమిని చుట్టి, రాజులందరిని సంహరించి, ఈ ధరణిని అంతటినీ కశ్యపునకు ఇచ్చివేసావు కదా, పరశరామావతారా!.....అని శతకకారుడు నృసింహ కవి వాక్కు.
*మహానుభావా, కరుణాసింధూ, నీ భక్తులను రక్షించడానికి, ధర్మరక్షణార్ధం నీవు ఎత్తిన అవతారాలు లెక్కకు మిక్కిలి అయినా మా మానవాళికి నిత్య ఆకలి కదా, పరపాత్పరా!*
.....ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి