కందము :
*వనజాక్ష భక్తవత్సల*
*ఘనులగు త్రైమూర్తులందు | కరుణానిధివై*
*మను నీ సద్గుణజాలము*
*సనకాది మునీంద్రు లెన్న | జాలరు కృష్ణా !*
తా.: ఓ రుక్మిణీ నాధా, సత్యా వల్లభా, గోపికాలోలా..
తామర పువ్వుల వంటి కన్నలతో నీ భక్తులను ప్రేమతో నిండిన చూపులతో చూచే ఓ కృష్ణా! త్రిమూర్తులు అనబడే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల యందు, బ్రహ్మ, మహేశ్వరుల కంటే ఎక్కువగా దయాగుణము కలిగిన నీ సద్గుణములను సనక, సనందనాదులే పొగడఢలురు, నీ గుణము కీర్తించడం నావల్ల అవుతుందా, కృష్ణా. నా వల్ల అవదు ...అని శతకకారుడు నృసింహ కవి వాక్కు.
*మహానుభావా, మార్తాండ తేజ, సద్గుణముల సారమే నీవు. నిన్ను చూచి, నీ వర్ణన విన్న తరువాత సద్గుణముల గురించి విడిగా తెలుసుకొనవలసిన అవసరము వుండదు, కృష్ణా*
.....ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి