శ్రీ కృష్ణ శతకము- పద్యం (౪౮ - 48)

 కందము :
*అపరాధ సహస్రంబుల*
*నపరిమితములైన యఘము | అనిశము నేనుం*
*గపటాత్ముఁడనై జేసితి*
*చపలుని ననుగావు శేష | శాయివి కృష్ణా !* 
తా.: ఓ రుక్మిణీ నాధా, సత్యా వల్లభా, గోపికాలోలా..
ఆదిశేషుని పరుపుగా చేసుకుని నిద్రించేవాడా, శేషశయనా! కృష్ణా!!  నేను లెక్కపెట్టలేన్ని తప్పులను చేసినవాడను. ప్రతి క్షణమూ కూడా పాప చింతన చేసేవాడను.  మనస్సు నీయందు నిలుపలేని చపలమైన చంచల చిత్తుడను.  అందువల్ల నన్ను నీవే రక్షణ చేయాలి కృష్ణా!! ...అని  శతకకారుడు నృసింహ కవి వాక్కు.
*మహానుభావా, మార్తాండ తేజ, నీవు సద్గుణముల సారమే.  కానీ, ఈ భూమి మీద మేమందరము నిరంతరము నీ మాయలో పడిపోయి,  కృష్ణ మాయలో పడి కొట్టుకుపోతుంటాము. మమ్మల్ని, నీ మాయలో పడేసిన నువ్వే తప్ప వేరొకరు రక్షించలేరు.  అందుకని, పుండరీక వరదా, నిరంతమూ, తరంతరంగా మమ్మల్ని కాపాడు తండ్రీ!!! కృష్ణా*
.....ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss
కామెంట్‌లు