*శ్రీ కృష్ణ శతకము* - పద్యం (౪౯ - 49)

 కందము :
*నరపశువు మూఢచిత్తుఁడ*
*దురితారంభుఁడను మిగుల | దోషగుఁడను నీ*
*గురుతెరుఁగ నెంతవాడను*
*హరి నీవే ప్రాపుదాపు | నౌదువు  కృష్ణా !* 
తా.: ఓ రుక్మిణీ నాధా, సత్యా వల్లభా, గోపికాలోలా..
మేము మనిషి జన్మ ఎత్తిన పశువు వంటి వాళ్ళము.  మూఢత్వము మూర్తీభవించిన వాళ్ళము.  చిత్తశుద్ధి లేని వారము.  ఎల్లప్పుడూ పాపపు ఆలోచన చేస్తూ, పాపాలను చేస్తూ వుండే వాళ్ళము.  ఇటువంటి మాకు, నీవే దిక్కు. మాకు వెన్నుదన్నుగా వుండగలిగిన వాడివి. నీవు తప్ప మాకు వేరే దిక్కు మాకు లేదు, కృష్ణా!!! ...అని  శతకకారుడు నృసింహ కవి వాక్కు.
*పరమేశ్వరా, మేము నిరంతరమూ పాప పంకిలములో కొట్టమిట్టాడుతున్న వాళ్ళము. మమ్మల్ని ఉద్ధరించగలిగే వాడవు నీవే, మహానుభావా, మార్తాండ తేజ!!! పాపసాగరంలో కొట్టుకు పోతున్న మా జీవితాలను ఒడ్డుకు చేర్చి, మమ్మల్ని నీ దగ్గరకు నీవే చేర్చుకో, కృష్ణా!!!*
.....ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss
కామెంట్‌లు