కందము :
*పంచేద్రియ మార్గంబుల*
*కొంచెపు బుద్ధిని చరించి | కొన్ని దినంబుల్*
*ఇంచుక సజ్జన సంగతి*
*నెంచగ మిమ్మెరిగినాఁడ | నిప్పుడె కృష్ణా !*
తా.: ఓ రుక్మిణీ నాధా, సత్యా వల్లభా, గోపికాలోలా..
ఇంతకాలం మనసు, కన్ను, ముక్కు, నోరు, చెవులు అనే ఐదు ఇంద్రియాలు చెప్పినట్టు విని చెడు దారుల్లో తిరిగాను. ఇప్పుడే దొరికిన మంచివారి స్నేహం వల్ల నిన్ను తెలుసుకోగలిగాను, కృష్ణా!!! ......అని శతకకారుడు నృసింహ కవి వాక్కు.
*జగదోద్ధారకా కృష్ణా!!! మేము ఇంద్రయలోలులమై ఎన్నో పాపా కార్యాలు చేస్తుండేవారం. ఇదంతా నీ ప్రేరణే కదా. ఇప్పుడు నీ దయవలన నీవు కల్పించిన స్నేహాలను ఆసరాగా చేసుకుని నిన్ను తెలుసుకునే అవకాశం నీవే ఇచ్చావు దేవదేవా.*
.....ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి