బొమ్మల పెండ్లి( బాల గేయం )-పిడపర్తి అనితా గిరి,- సిద్దిపేట-7330885931
సంధ్య, సరళ కలిసారు
సంతకు వారు వెళ్ళారు
చక్కటి బొమ్మలు తెచ్చారు
చక్కగా ముస్తాబు చేశారు 

పిల్లలందరిని పిలిచారు
సిరిసిరి మువ్వలు
చిన్నారి బాలలు
బొమ్మరిల్లు కట్టారు
చిన్న పందిరి వేసారు
డుం డుం బాజా మోగించారు

బొమ్మల పెళ్లి చేశారు
చిన్న గురిగిల వండారు
పప్పు పులుసు చేసారు
బంతి భోజనం చేశారు

ఆటలెన్నో ఆడారు
బొమ్మల పెండ్లి చేశారు
ఆనందంగా ఉన్నారు
సెలవు రోజు గడిపారు

కామెంట్‌లు