సూర్య చంద్రుల వెలుగులు
తెలుగు భాషకు జిలుగులై
తరాల పాటు నిలవాలి
తనివి తీర కావ్యములై
భళారే తెలుగు భాష
సవాలే విసిరిందిక!
అ ఆ ఇ ఈ లతోటీగ
అమ్మ ఆవు పాఠాలూ
ఇంట్లో నుండే మొదలు
తెలుగు బాల మురిపాలూ
అయ్యారే తెలుగుభాష
అమెరికాలో నిలిచే హమేషా!
కృష్ణ రాయల వైభవం
అష్ట దిగ్గజాల్ కవనము
మరుగున పడవు ఎన్నడూ
తెలుగు తల్లికి వందనము
జేజేలు పలుకుదాము రండీ
తెలుగు భాషను వెలిగించండి!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి