రైతు కష్టం:-ఎడ్ల లక్ష్మి-సిద్దిపేట-8466850674
కష్ట జీవి రైతన్నా
కండ లేవి నీకన్నా
ఒంటి కూర్పు నిద్రతో
కటిక నేల పడకన్నా

కష్టపడుట నీవంతు
సంపదేమొ ఎవరొంతు 
ఆరు నెలల శ్రమంతా
మద్య దాళారిలొంతు

రైతునిక రాజంటారు 
రైతులనే ముంచుతారు
స్వార్థం లేని రైతులు
ప్రజల కడుపు నింపుతారు

రైతుల త్యాగఫలము
సంపదలకు మూలము
పండించిన పంటలన్ని
దేశవృద్ధికి బలము


కామెంట్‌లు