అందమైన రైలుబండి
మా ఊరికి వచ్చింది
బండిలోన ఎక్కి నేను
హైదరాబాదు పోయాను
రకరకాల పార్కులన్ని
తిరిగిఅన్ని చూశాను
అందులో అందముగా
జూపార్కు ఉండెను.
డబ్బా డబ్బాలరైలు
పట్టమీద వెళ్లుచుండ
పట్టరాని సంభరము
నాకేమొకలిగింది.
జాలి లోని నెమలి చూస్తె
నాట్యమాడుచుండెను.
బండలాంటి తాబేలు
గుట్టలాగ కదులుచుండె
నీటిలోని మొసళ్లేమొ
ఆహారము వెతుకుచుండె
సాయంకాలము నేను
చార్మినార్ వెళ్లినాను
చార్మినార్ చూసినంక
మక్కమసీదువెళ్లాను
చార్మినార్ కు రాయిలేదు
మక్కామసీదుకు మట్టిలేదు
గొప్ప గొప్ప కట్టడాలు
ఎప్పుడూ చూడలేదు.
అన్నిచూసి నంకనేను
రాత్రిఇంటికొచ్చాను.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి