వివిధ మణిపూసలు:--తోకల నవ్య-9వ తరగతి-ZPHS గుర్రాలగొంది -జిల్లా సిద్దిపేట -చరవాణి:9704865816
పద్యాలన్ని చదువాలి
అందు నీతిని చూడాలి
పదిమందికిచెప్పాలి
మంచి వాటిని నేర్వాలి

కన్న ఊరిని మరువకు
తల్లిదండ్రుల విడువకు 
నీ భార్యా పిల్లలను
విడిచివలసను వెళ్ళకు

మిరప తోటను నాటాము
రోజు నీళ్లను పోశాము
తోట బాగా పెరిగాక 
అమ్మి డబ్బులు దెచ్చాము

మా ఊరిల చెరువుండెను
భారి వానలకు నిండెను
మత్తడి బాగా దుంకగ
కరువు కాటకాల్ పోయెను

ఆదివారము వచ్చింది 
అమ్మ టిఫిను చేసింది 
మాకు అందరకు పెట్టి
 అమ్మ మాతోను తిన్నది


కామెంట్‌లు