జీవితం ఒక ఆట
పోరాటమే వేట
మనసు ఊగిసలాట
ఓ మమతలమ్మ
పనికి రానేయాట
పదును లేనిది వేట
మతిలేని సైయాట
ఓ మమతలమ్మ
ఊరు పొమ్మని వచ్చు
కాడు రమ్మని వచ్చు
శివుడు ముక్తిని ఇచ్చు
ఓ మమతలమ్మ
రాదేది నీతోడు
పట్టు విడుపులు వీడు
శివుడు తీర్చును గోడు
ఓ మమతలమ్మ
పోరాటమొక ఎత్తు
ఆరాటమొక ఎత్తు
రెండింటికీ పొత్తు
ఓ మమతలమ్మ
పుట్టడం ఒక ఎత్తు
పెరగడం ఒక ఎత్తు
నడక మారక చిత్తు
ఓ మమతలమ్మ
ఏముంది మురిసేవు
ఎందుకని వగసేవు
ఆట ముగిసే పోవు
ఓ మమతలమ్మ
బంధాలు ఒక ఎత్తు
బాధ్యతలు ఒక ఎత్తు
కాలమెమొ గమ్మత్తు
ఓ మమతలమ్మ
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి