ప్రతి జీవికి ఓ గుణముండు
ప్రత్యేకతకు అది మెండు
అడవిలోన తిరుగుచునుండు
అందరినాకర్షిస్తుండు
అందంలో బహు చక్కదనం
చంద్రుని వంటి తెల్లదనం
ఆలోచనలో చురుకుదనం
కొమ్ములు లేని కొంటెదనం
చూడబోతె చిరు ఆకారం
ఏదో తెలియని మమకారం
పట్టాలని అందరికిష్టం
దొరకదుకద అది దానిష్టం
చెవులపిల్లియని అంటారు
చెవులు పట్టి లేబడరు
కుందేలు అనికూడ అంటారు
దొరికిందంటే వదలరు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి