మమతలమ్మ పదాలు:--మమత ఐల-హైదరాబాద్-9247593432
ఆగునా కాలమ్ము
మిగులునా జీవమ్ము
జీవి దేవుని సొమ్ము
ఓ మమతలమ్మ

శ్వాసతో పుట్టేరు
ఆశతో పెరిగేరు
అందుకొరకే పోరు
ఓ మమతలమ్మ

విసుగుతో అలిసేరు
నడి మధ్యనాగేరు
కార్య దీక్షలొ వీరు
ఓ మమతలమ్మ

కర్మ ఫలమంటారు
చిన్న బోతుంటారు
సఫలమొందని వారు
ఓ మమతలమ్మ

ఓటమైతే నేమి
విజయమైతే నేమి
సంతృప్తి పడరేమి
ఓ మమతలమ్మ


కామెంట్‌లు