వారెవ్వా ఆన్లైన్లు తల్లి దండ్రులగచాట్లు
చదువులేమొ సారెడు బల్పాలు దోసెడు
విజ్ఞానం మూరెడు డబ్బులేమొ బారెడు
ఇల్లు పాఠశాలాయె వింతల పాఠాలయె
గురు శిష్యుల సాంగత్యం ఇల్లిల్లు తెలిసి పోయె
ఉన్న వాల్లదొక బాధ లేని వాల్లదొక గాధ
విద్యార్థుల ర్యాంకులు తల్లి తండ్రి కంప్లెంట్లు
నాటికి నేటికి మధ్యన నలుగుతున్న గౌరవాలు
ఇంటింటికి పరిమితం ఇది కరోనా పుణ్యం
నిరంతర సంరక్షణ అనుభవానికచ్చెనా
పిల్లలతో పెద్దలు తిలకించిరి పాఠాలు
విద్యార్థుల దృఢచిత్తం గమనించటమే వైనం
టీచర్లతొ స్నేహాలు జరిగిన సంభాషణలు
క్రమశిక్షణ రీతులు కార్పోరేట్ చదువులు
నడవడికను చూసిరి చిత్రం గమనించిరి
తనదాక వస్తె గాని తగువేదో తెలిదే
పిల్లల స్వాతంత్ర్యాలు పెద్దలకిరకాటాలు
తలనొప్పుల భారంతో తల్లులైరి టీచర్లు
పట్టుబట్టి నేర్చిరి పాఠాలను మాతలు
పిల్లల బురిడీ చేష్టలు పెద్దలకో సవాలు
క్రోవిడ్ తీర్థం చూపెను అనుకోని స్థితిగతులు
సుఖదుఃఖపు జాడలు జాగ్రత్తల నీడలు
వారెవ్వా ఆన్లైన్లు తల్లి దండ్రులగచాట్లు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి