సామజవరగమన--పేరడీ (హాస్య పాట):-మమత ఐల-హైదరాబాద్-9247593432
//ప//
నీ కాళ్ళని పట్టుకు వదలనన్నవి చూడే నాకళ్ళు
నువ్వింటిని అలాబూజును చేస్తవ్ దయలేదా అసలు

నీ కాళ్ళకు ఉన్నవి అంతులేని
గజిబిజి అల్లికలు
నువ్ తగనిచోట గూడల్లుటఘనతౌనానీకు

సామజవరగమన నీబూజు దులపగలనా....
నీవింత చేష్టలన్నినేను
కట్టిపెట్టగలన
సామజ వరగమన
నీ బూజుదులపగలనా..
//చ//

నీ నిర్మాణము సుందరమని అంటారే జనులు
ఆ గూడుకట్టు స్థలమేదో గుర్తులేద నీకు
చిటికెలోన అల్లెదనని తెగ మురిసిపోకు
కలకాలం ఉండేలా చూసుకోవ అసలు

సామజవరగమన
నీ బూజుదులపగలన
నీ గూడుకొరకు చోటునేనుచూపించగలనా..
సామజ వరగమన
నీ బూజుదులపగలన
//చ//
అంతచిన్న

జీవివైన అందవు నీవసలు
ఎంతతపెద్ద మనిషినైన లెక్క చేయవసలు
నీ అల్లిబిల్లి చతురతకు ఏమిచేయగలను
నీ ముచ్చటైన నడకచూసి గూడు చెరపగలను

సామజవరగమన నీ బూజు దులుప గలనా
నీ పైన జాలి చూపించి నేను ఉండ గలనా...
సామజవరగమన నీబూజు దులపగలన 

కామెంట్‌లు