కలముకు ఉత్సాహముతెచ్చి
కవుల మనస్సుకు మెరుపద్ది
అక్షరాలన్ని సుస్వరాలుగా
పలికించెడి పండగ రోజు
నల్లనికురులు జారవిడుచుకొని
ఝరీప్రవాహపు సొంపులద్దుకొని
హృదయాంతరంగమునకావ్యకన్యక
నాట్యము చేయుచు కదిలినరోజు
పదబంధాలను మలుపులతిప్పుతు
కొత్త సవ్వడికి పట్టంకడుతూ
జాజి సుగంధపు సొంపులమరుతూ
మెరిపించే కవితకు పుట్టిన రోజు
పదముకుకలముకు అనుబంధం
సుధారాగాల యెదబంధం
భావకవిత్వపు రాగబంధం
కవితోత్సవాల సుమధుర చందం
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి