పంతం (బాలగేయం):-మమత ఐల-హైదరాబాద్-9247593432
సజీవదహనం చేస్తుంది
సర్వనాశనం చేస్తుంది
వినాశనానికి రాజునునేనని
విలయతాండవం చేస్తుంది

ఆయుధమంటే నేనే అంటూ
చేతబూనుమని చెప్తుంది
మానవజాతి సంబంధాలను
మట్టిలోన తొక్కేస్తుంది

మోసగించమని చెప్తుంది
మాటవినకుండ చూస్తుంది
సంబంధాలను సహించకుండ
మంచిచెడ్డ మరిపిస్తుంది

గుర్తుపట్టని మాయలపడితే
పంతం నేనని చెప్తుంది
పట్టింపు ముఖ్యమనిచెప్తుంది
కుటుంబమంతా ముక్కలుచేస్తూ
తల్లీ పిల్లల భార్య భర్తల
నేకాకులుగా చేస్తుంది
అను బంధాలను చంపేస్తుంది

దరిదాపుకు రానిచ్చేవా
దహించి వేస్తానంటుంది
చురుకుతనంతో సాగేవా
తోకముడిచి కూర్చుంటుంది



కామెంట్‌లు