మమతలమ్మ పదాలు:-మమత ఐల-హైదరాబాద్9247593432

 1
చేసేది ఒక తప్పు
కప్పి పుచ్చుట ముప్పు
పెరిగేను ఆ తప్పు
ఓ మమతలమ్మ
2
పేగు బంధం అమ్మ
పేరుకే ఈ కొమ్మ
చిన్న చూపయెనమ్మ
ఓ మమతలమ్మ
3
కళలు కన్నా గూడు
యెదలోని ఈ గూడు
కనిపెట్టులే శివుడు
ఓ మమతలమ్మ
4
మదిలోని దీపాలు
మనిషిలో పాపాలు
వెలిగేను సగపాలు
ఓ మమతలమ్మ
5
అనుబంధ శికరాలు
అనుకూల వరహాలు
ఏటి గట్టున తేలు
ఓ మమతలమ్మ
కామెంట్‌లు