బట్టలు శుభ్రం:-వరుకోలు మాధవి-సిద్ధిపేట జిల్లా-చరవాణి:9441782816
మాసిన బట్టలు తీసుకెళ్లి
బకెట్టు లోనా వేయాలి

నల్లా వద్దకు తీసుకువెళ్లి
నీళ్ళు నిండా నింపాలి

సరుపు అందులో వేయాలి
చేతి తోడా కలుపాలి

కొంతసేపు నానాక
ఒక్కటొక్కటిగా తీసుకొని

బ్రష్ తోబాగా రుద్దాలి
మురికి అంతా వదిలాక

నీటిలోన జాడించాలి
మల్లెల వలె తెల్లగాను

తళ తళగా మెరియును
వేసుకుంటే ఒంటికి
అందాన్నెంతో ఇచ్చును


కామెంట్‌లు