లిట్మస్ కాగితం అంటే....?:---గుర్రాల లక్ష్మారెడ్డి, కల్వకుర్తి.-నాగర్ కర్నూల్ జిల్లా.-సెల్ నెంబర్.94913879.

 బాలలూ! లిట్మస్ కాగితం అనే మాట మీ సైన్స్ మాస్టారు నోట
వినేవుంటారు. దీన్ని ప్రయోగశా
లల్లో ఆమ్లాలు, క్షారాల అస్థిత్వాన్ని
గురించి తెలుసుకోవడానికి మనం
ఉపయోగించే కాగితాన్ని లిట్మస్
కాగితం అంటారు. ముఖ్యంగా
ప్రయోగశాలల్లోలిట్మస్ కాగితాన్ని
ముక్కలుగా చింపి ద్రావకం లో
ముంచి తీసి ఆమ్ల ,క్షార గుణాలను
గుర్తిస్తారు.లిచెన్స్అనే మొక్క
నుండి ఈ లిట్మస్ అనే ప్రకృతి
సిద్ధంగా గా తయారవుతుంది.
ఇందులో అనేక రకాలు ఉన్నాయి
రొసెల్లాటింక్టోరియా అని,మల్టికల
రింక్టోరియా,గ్రాస్ డార్క్ లెబరోరిం
క్టోరియా అని వీటికి పేర్లు.
       ఆమ్లాల వలన నీలం లిట్మస్
ఎర్రగాను,క్షారాలవలన ఎర్ర లిట్మస్
నీ లంగాను మారుతుంది. తటస్థ
ద్రవ్యములు litmus కాగితం
రంగు మారదు. నీలం రంగు పదా
రుద్రం తయారు కావడానికి రొసెల్లా
టింక్టోరియా అనే లిచెన్స్ మొక్కను
అమోనియా, పొటాషియం కార్బో
నెట్లతో కలిపి పులియ పెడతారు.
తరువాత దీన్ని కాగితానికి పట్టి
స్తారు. అలా పట్టించ గా తయారైన
నీలం రంగు కాగితాన్నే మనంనీలం
లిట్మస్ కాగితం అని అంటాము.
       ఆమ్లాలను పరీక్షించడానికి
దీనిని ప్రయోగశాలల్లో ఉపయోగి
స్తారు.అర్చిల్,లేక కడ్ బీర్ అనే
ఎర్రటి డై నుంచి ఎర్ర లిట్మస్ కాగి
తాన్ని తయారుచేస్తారు.ఆల్కనా
టింక్టోరియా మొక్క వేరు నుంచి
పై ఎర్రటి డై తయారవుతుంది.
ఇది ఆల్కహాలు, బెంజిన్, ఈథర్
లలో మిశ్రిత మవుతుంది.
       తెల్లటి కాగితాన్ని ఈ ద్రావకం
లో ముంచితే ఎర్రటి లిట్మస్ కాగితం
తయారవుతుంది .క్షారాలను గుర్తించడానికి దీన్ని వాడుతారు.

కామెంట్‌లు