శివ భక్తులం మేం శివభక్తులం
ఇహపర సుఖాల విముక్తులం
సదాశివుడే మా ఆరాధ్య దైవం
యదా తదా ఆ వైపే మా పయనం
రండి రండి భక్తులారా మీరండి
లెండి లెండి దైవధ్యానం చేయండి
కరుణిస్తాడులే తప్పక ఆ శివుడు
వరమిస్తాడులే చెప్పకనే ఈభవుడు
రుద్రుని ప్రియ సంఖ్య పదకొండు
రుద్రంచేస్తే మీ పుణ్యఫలం పండు
ఆ రుద్రుడే మీకు అండగా ఉండు
చిద్రంలేకుండా బతుకుసాగుచుండు
శివేచ పూజితే దేవాః పూజితాస్సర్వ ఏవహి
తస్మాచ్చ పూజయేద్దేవం శంకరం లోక శంకరం
మనం సముద్రంలో స్నానం చేస్తే
సకల నదులలో స్నానం చేసినట్లే
ఆ శివుడిని ఆరాధిస్తే ముక్కోటి దేవతలను ఆరాధించినట్లే.అందువల్ల సకల
శుభాలను ప్రసాదించే శివుడిని ఆరాధించవలెనని మన శాస్త్రం
ఉవాచ.సకల దేవతలను ఆరాధించడం,ఆ దేవతల పూర్ణ అనుగ్రహం సంపాదించడం ఎంతటి
వారికైనా సాధ్యం కాదు.ఎంతటి తపోధనులకైనా అది అసాధ్యమే.
కాని ఒక్క శివుడిని ఆరాధిస్తే సకల దేవతలను ఆరాధించిన ఘనత
కల్గుతుంది. సకల దేవతల పూర్ణ అనుగ్రహం కూడా లభిస్తుంది.
శివారాధన అంతటి మహత్తరమైనది. మహిమాన్వితమైనది. అందుకే
కూర్మ పురాణం లో ఈ క్రింది విధంగా ప్రబోధించింది.
ఏవం విధే కలియుగే దోషాణా మేక శోధనం
మహా దేవ నమస్కారో ధ్యానం దానమితి శృతి.
ఈ కలియుగంలోని మనవులందరు చేసే సర్వదోషాలను,పాపాలను హరించే
ఏకైక సాధనం శివారాధనే.ఎవరైతే
శివుడికి నమస్కరించి ధ్యానిస్తారో
వారికి సమస్త దానములు చేస్తే ఎంతటి ఫలం దక్కుతుందో అంత
ఫలం కేవలం ఒక్క శివారాధన ద్వారనే దక్కుతుంది అని తెలిపింది.
33కోట్ల దేవతలు ఒక్క శివుడిలోనే
ఉన్నారు.కాబట్టి శివుడిని ధ్యానిస్తే
సమస్త దేవతలను ధ్యానించి నట్లే.
ఈ పరమ సత్యాన్ని తెలుసుకొనే
విష్ణువు శ్రీకృష్ణుడు శ్రీరాముడు ఆ
శివున్ని ఆరాధించిసర్వ దేవతల అనుగ్రహాన్ని పొందారు. అందుకే
అధర్వణ ముని శివ ధ్యానమే
సర్వ శ్రేష్ఠమని, అధర్వ శికో పనిషత్తులో స్పష్టం చేశారు. సనత్ కుమారుడు కి శివ ఏవ ధ్యేయ శ్శి వంకర సర్వమస్యత్పరిత్యజ్య
అని అధర్వణ ముని బోధించాడు.
కావున శివ ధ్యానమే సత్యమని నిత్యమని శివధ్యానమే సర్వ శ్రేష్టమని మనందరం తెలుసుకుని ఆ శివున్ని మన మనసారా నేటి శివరాత్రి శుభదినాన ధ్యానిధ్ధాం. సకల సంపదలతో తులతూగుతూ ఇహపర సుఖాలను జయిద్దాం.
తరిద్దాం.
ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి